Sunday, December 22, 2024

త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

- Advertisement -
- Advertisement -

త్వరలోనే ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో ఆర్థికశాఖ ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే త్వరలోనే రెండు పెండింగ్ డిఏలను ప్రకటించి ఉద్యోగులకు దసరా కానుకను అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది. ఆ దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా సమాచారం. ఈ నెలఖారులోగా రెండు డిఏలకు సంబంధించి నిధులు సమీకరించాలని సిఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖను ఆదేశించినట్లుగా ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ ఈ నెలాఖరులోగా నిధులు సమకూరితే అక్టోబర్ జీతంతో కలిపి, ఒకవేళ నిధులు సమీకరణ కాకపోతే నవంబర్ జీతంలో ఈ రెండు పెండింగ్ డిఏలను కలిపి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారం. పెండింగ్‌లో ఉన్న డిఏలను విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు కొన్ని రోజులుగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలో ఈ మేరకు ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ప్రతినెలా రూ.4,800 కోట్ల జీతాలు చెల్లింపులు
ప్రస్తుతం ఉద్యోగులకు సంబంధించి నాలుగు డిఏలు (జూలై- టు డిసెంబర్ 2022, జనవరి- టు జూన్ 2023), ‘జూలై- టు డిసెంబరు 2023, జనవరి- టు జూన్ 2024)లు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అందులో రెండింటిని ఉద్యోగులకు ఇప్పించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలిసింది. దీనికి సంబంధించి ప్రభుత్వంపై ఎంత ఆర్థికభారం పడుతుందన్న విషయాన్ని ఇప్పటికే ఆర్థికశాఖ ప్రభుత్వానికి నివేదిక అందించినట్టుగా సమాచారం. గత ప్రభుత్వంలో 2022 జూలై నుంచి ఉద్యోగుల డిఏ (కరువు భత్యం)లు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తంగా నాలుగు డిఏలను ఉద్యోగులకు ప్రస్తుతం ఇవ్వాల్సి ఉండగా త్వరలోనే మరో డిఏ డబ్బులు కూడా ఉద్యోగులకు చెల్లించాల్సి రావడం, మొత్తంగా డిఏల సంఖ్య ఐదుకు చేరుకుంటుందని, ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం రెండు డిఏలను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది. ప్రస్తుతం ఈ రెండు డిఏలను ఉద్యోగులకు చెల్లిస్తే ప్రభుత్వంపై రూ.300 కోట్ల భారం పడుతుందని ఆర్థిక శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షన్ల కోసం దాదాపు రూ.4,800 కోట్లను ప్రతి నెలా ప్రభుత్వం ఖర్చు చేస్తుండగా రెండు డిఏల చెల్లింపుతో మరో రూ.300 కోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడనుంది.

జూలై- టు డిసెంబర్ 2022, జనవరి- టు జూన్ 2023
ఈ నేపథ్యంలో అక్టోబర్ 01వ తేదీ లేదా నవంబర్ 01వ తేదీన ఉద్యోగులకు అందించే జీతంలో ఈ రెండు డిఏలను కలిపి ఇచ్చే అవకాశం ఉందని తెలిసింది. సిఎం, డిప్యూటీ సిఎంలను వేర్వేరు సందర్భాల్లో కలిసిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలను రాతపూర్వకంగా తెలియజేయడమే కాకుండా నాలుగు పెండింగ్ డిఏల గురించి కూడా ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులు దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న రెండు డిఏలను (జూలై- టు డిసెంబర్ 2022, జనవరి- టు జూన్ 2023)లకు సంబంధించిన డిఏలను ప్రభుత్వం ప్రస్తుతం విడుదల చేయాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. జూలై- టు డిసెంబర్ 2022, జనవరి- టు జూన్ 2023 డిఏలను 3.64 శాతంగా గత ప్రభుత్వం ప్రకటించింది. కానీ, వాటిని అమలు చేయకుండా గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టడంతో ప్రస్తుతం వాటిని విడుదల చేసే అవకాశం ఉందని తెలిసింది. (జూలై- టు డిసెంబర్ 2022, జనవరి- టు జూన్ 2023) ఈ రెండడు డిఏలను క్లియర్ చేస్తే ఇంకా జూలై- టు డిసెంబర్ 2023, జనవరి- టు జూన్ 2024 పెండింగ్‌లో ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి డిఏ చెల్లించాల్సి ఉండగా, బిఆర్‌ఎస్ హయాంలో మూడు డిఏలు, కాంగ్రెస్ అధికారం చేపట్టాక ఒక డిఏ పెండింగ్‌లో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News