హైదరాబాద్ : రాష్ట్రంలో శనగ రైతులకు శుభవార్త. లక్షా 20 వేల308 మెట్రిక్ టన్నుల శనగలను కనీస మద్దతు ధరతో సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రూ. 702 కోట్ల, 21 లక్షల నిధులను కూడా మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైతుల నుంచి శనగలను సేకరించే బాధ్యతను మార్క్‌ఫెడ్‌కు నోడల్ ఏజెన్సీగా అప్పగించింది. కేంద్ర ప్రభుత్వం గతంలో నిర్ణయించిన 50328 మెట్రిక్ టన్నుల
శనగల సేకరణ కారణంగా రాష్ట్ర రైతులు పండించిన మొత్తం శనగ పంటను పూర్తి స్థాయిలో కొనుగోలు చేసే పరిస్థితులు లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో రైతుల నుంచి లక్షా 20 వేల మెట్రిక్ టన్నులను కొనుగోలు చేయాలని నిర్ణయిస్తూ.. ఈ ప్రక్రియను మార్క్ ఫెడ్‌కు బాధ్యతలు అప్పగించింది. మార్క్‌ఫెడ్ ద్వారా రాష్ట్రంలో శనగల కొనుగోలుకు ఏర్పాట్లు చేసింది. యాసంగి (రబీ) సీజన్‌లో శనగలను కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయనున్నారు.