Monday, January 20, 2025

హెచ్ 1బి వీసాలపై శుభవార్త!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రధాని మోడీ అమెరికా పర్యటన కీలక దశకు చేరుకున్న తరుణంలో ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు చోటు చేసుకున్నాయి. అంతరిక్ష పరిశోధనకు సంబంధించి ఇరు దేశాల సహకారంపై ఒక ఒప్పందం ఇప్పటికే కుదరగా లక్షలాది మంది భారతీయులకు మేలు కలిగించే విధంగా హెచ్1బి వీసాలకు సంబంధించి అమెరికా ఒక కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. హెచ్1బి వీసాల పునరుద్ధరణ విధానాన్ని మరింత సరళీకరించేలా బైడెన్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంటుందని సమాచారం.

దీనికి సంబంధించి గురువారం అధికారిక ప్రకటన వెలువడవచ్చని తెలుస్తోంది. దీంతో స్వదేశాలకు వెళ్లకుండానే ఎన్‌ఆర్‌ఐలు తమ వీసాలను రెన్యువల్ చేసుకునేందుకు ఓ పైలట్ ప్రాజెక్టును ప్రకటించవచ్చని తెలుస్తోంది. దీనివల్ల అమెరికాలోని లక్షలాది మంది భారతీయులకు ప్రయోజనం చేకూరుతుంది. మరో వైపు అహ్మదాబాద్‌లో సెమీ కండక్టర్ టెస్ట్, అసెంబ్లీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు అమెరికాలోని ప్రముఖ చిప్ తయారీ సంస్థ మైక్రాన్ టెక్నాలజీ ప్రకటించింది. ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంస్థ తెలిపింది.

Also Read:  టైటాన్ ఆచూకీ లభ్యం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News