Monday, January 20, 2025

హెచ్4 వీసాదారులకు అమెరికా గుడ్ న్యూస్

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : హెచ్ 4 వీసాదారులకు అమెరికా శుభవార్త ప్రకటించింది. త్వరలోనే వర్క్ ఆథరైజేషన్ బిల్లుకు ‘ సెనేట్ ’ ఆమోదం తెలపనున్నట్టు పేర్కొంది. దీంతో సుమారు లక్ష మంది భారతీయులకు లబ్ధి చేకూరుతుంది. ఈ విషయంపై ఆదివారం అమెరికన్ సెనేట్‌లో రిపబ్లికన్, డెమోక్రాట్స్ మధ్య చర్చ సాగింది. చివరకు జాతీయ భద్రతా ఒప్పందానికి ఆమోదం తెలిపేందుకు ఇరు వర్గాలు తమ అంగీకారం తెలిపాయి. హెచ్ 1 బీ వీసా కలిగిన వారి కుటుంబ సభ్యులకు ( భాగస్వాములు, 21 ఏళ్ల లోపు వయసున్న పిల్లలు) అమెరికాలో ఉద్యోగం చేసుకోవడానికి వీలుగా హెచ్4 వీసాలు జారీ చేయడం జరుగుతుంది. అయితే ఈ ప్రక్రియ అంత సులువు కాదు. ముందుగా ఈ వీసా కలిగిన వారు ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్(ఇఎడి), ఐ765 కోసం తప్పకుండా దరఖాస్తు చేసుకోవాలి. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయి, ఆథరైజేషన్ వస్తేనే అమెరికాలో ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది.

అయితే ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి ఏకంగా ఏడాది సమయం పడుతుంది. దీంతో హెచ్4 వీసాదారులు తమ ఉద్యో గ అవకాశాలను కోల్పోవలసి రావడంతో అభ్యంతరాలు తలెత్తాయి. అందువల్ల ప్రస్తుతం ఉన్న నిబంధనలను మార్చారు. ‘ఆటోమేటిక్ వర్క్ ఆథరైజేషన్ ’ కల్పించేలా కొత్త బిల్లును రూపొందించారు.ఈ బిల్లుకు త్వరలోనే ఆమోదం తెలపనున్నట్టు వైట్‌హౌస్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ “ కొన్ని దశాబ్దాల వెనక్కు వెళ్లి చూస్తే , ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ విచ్ఛిన్నమైంది. ఇప్పుడు దాన్ని సరిచేసే సమయం ఆసన్నమైంది. కొత్తగా తీసుకొస్తున్న ఈ బిల్లు అమెరికాను బలోపేతం చేయడంతోపాటు సరిహద్దులను సురక్షితం చేస్తుంది. అమెరికాకు అనుగుణంగా , చట్టబద్ధంగా వలసలకు అవకాశం కల్పిస్తుంది ” అని పేర్కొన్నారు.ఈ విధానం కింద ఏటా 18 వేల మందికి ఉపాధి ఆథారిత గ్రీన్ కార్డులను జారీ చేస్తారు. ఐదేళ్లలో సుమారు 1,58,000 మందికి లబ్ధి కలుగుతుంది. అలాగేఏడాదికి 25,000 మంది కె1, కె2, కె3 వలసేతర వీసా ( పర్యాటకం, వైద్యం,

వ్యాపారం, వంటి తాత్కాలిక పనుల కోసం జారీ చేస్తారు) ఉన్నవారితోపాటు లక్ష మంది హెచ్4 వీసాదారులకు తమ జీవిత భాగస్వామి పనిచేసే ప్రాంతంలో ఉద్యోగం చేసే అవకాశం లభిస్తుంది” అని వైట్ హౌస్ వెల్లడించింది. నిజానికి బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడుగా ఉన్న ప్పుడు 2015 లోనే హెచ్4 వీసాదారులకు ఉద్యోగాలు చేసుకోడానికి అవకాశాలు కల్పించారు. కానీ ట్రంప్ అధికారం లోకి వచ్చిన తరువాత దీనిపై ఆంక్షలు విధించడంతో ఎంతోమంది భారతీయులకు అవకాశాలు కోల్పోయాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News