Thursday, January 23, 2025

గ్రేటర్ వాసులకు శుభవార్త

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ /సిటీ బ్యూరో: గ్రేటర్‌వాసులకు ప్రభు త్వం మరో శుభవార్త తెలిపింది. ఆస్తిపన్ను బకాయిలకు సం బంధించిన వడ్డీపై 90 శాతం రాయితీని ప్రకటించింది. 2023 మార్చి నా టికి ఉన్న ఆస్తిపన్ను బకాయిలకు సం బంధించి కేవలం 10శాతం మాత్రమే వడ్డీ తో కలిపి చెల్లించే వెసులుబాటును కలిపిస్తూ బుధవారం ఉత్తర్వులను జా రీ చేసింది. ప్రభుత్వ,
ప్రైవేట్ ఆస్తి పన్నులు బకాయిలన్నింటికి ఇది వర్తించనున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది. గ్రేటర్‌లో పేరుకుపోయిన ఆస్తిపన్ను బకాయిల వసూళ్లుకు సంబంధించి 90 వడ్డీ రాయితీతో గతంలో మాదిరిగా వన్ టైమ్ సెటిల్‌మెంట్ (ఓటిఎస్) అవకాశం కల్పించాలని కోరుతూ జిహెచ్‌ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ ప్రభుత్వాన్నికి నివేదించారు. ఇదేక్రమంలో మున్సిపల్ పరిపాలన శాఖ డైరెక్టర్ ఇందుకు అనుమతిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు.

భారీగా వసూళ్లు కానున్న ఆస్తిపన్ను
ప్రభుత్వం తీసుకున్న వన్ టైమ్ సెటిల్‌మెంట్ (ఓటిఎస్) నిర్ణయంతో జిహెచ్‌ఎంసికి కాసుల వర్షం కురువనుంది. ఈ ఏడాది అధికారులు రూ.2100 కోట్ల ఆస్తిపన్ను వసూళ్లు లక్షంగా నిర్థేశించుకోగా, ఇప్పటీ వరకు దాదాపుగా రూ.1400 కోట్ల మేర ఆస్తిపన్ను వసూళ్లు అయ్యాయి. రూ. 700 కోట్ల మేర వసూళ్లు చేయాల్సి ఉండగా సమయం మాత్రం కేవలం మరో నెల రోజులే ఉంది. అంతేకాకుండా సార్వత్రిక ఎన్నికల సం బంధించి మార్చిలో ఎప్పుడైన నోటిఫికేషన్ వెల్లువడమే అవకాశం ఉండడంతో ఆస్తిపన్ను వసూళ్లపై ఆ ప్రభావం పడనున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకంది. 2023 మార్చి 31 నాటికి వరకు ఉన్న ఆస్తిపన్ను బకాయిలకు సంబంధించి వడ్డీపై 90 శాతం రాయితీని ప్రకటించింది. అయితే అసలు ఎంతో పాటు 10 శాతం వడ్దీని కలిపి ఒకేసారి చెల్లించే వారికి మాత్రమే ఓటిఎస్ వర్తించనుంది. దీంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే గత ఆర్ధిక సంవత్సరం బకాయిలతో పాటు ఈ ఏడాది ఆస్తిపన్ను కూడ చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఈ ఏడాది ఆస్తిపన్ను రూపంలో బల్దియాకు కాసుల వర్షం కురువ నుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్ర భుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అదనంగా దాదాపు గా రూ.300 కోట్ల పై చిలుకు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనాలో ఉన్నారు.

రూ.9803.39 కోట్ల బకాయిలు
గ్రేటర్‌లో భారీగా ఆస్తి పన్ను బకాయిలు పేరుకుపోయ్యాయి. గత ఏడాది మార్చి 31 నాటికి వ డ్డీతో కలుపుకుని మొత్తం రూ.9803.39 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయ్యాయి. ఇందులో 4,95,628 ప్రై వేట్ ఆస్తులకు సంబంధించి అసలు రూ.1887.59 కో ట్లు కాగా, వడీ రూ.2634.59 కోట్లు మొత్తం రూ. 4522.18 కోట్లు కాగా, కేంద్ర, రాస్ట్ర ప్రభుత్వ ఆస్తులు 1800లకు గాను అసలు రూ.1622.16 కోట్లు వడ్డీ రూ.3659.05 కోట్ల మొత్తం రూ.5281.21 కోట్లు రావాల్సి ఉంది. మొత్తం రూ. 9803.39 కోట్లలో అసలు రూ. 3509.75 కోట్లు కాగా, వడ్డీ రూ. 6293.64 కోట్లు. దీంతో అసలు కంటే వడ్డీ అధికంగా ఉండడం, ప్రభుత్వం తీసుకున్న ఓటిఎస్ నిర్ణయంతో ప్రజలు భారీ ఊరట లభించనుంది. రూ. 6293.64 కోట్లకు గాను ప్ర జలు 10 శాతం అంటే కేవలం రూ.629. 36 కోట్లు మా త్రమే చెల్లించాల్సి ఉండడంతో బకాయిదారుల నుంచి విశేష స్పందన లభించే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News