Sunday, January 19, 2025

హైదరాబాద్ జర్నలిస్టులకు శుభవార్త

- Advertisement -
- Advertisement -
ఇళ్ల స్థలాల సమస్యపై సానుకూలంగా స్పందించిన మంత్రి కెటిఆర్
జర్నలిస్టుల సంఖ్య, అర్హులైన జర్నలిస్టులకు సంబంధించి వివరాల సేకరణ

హైదరాబాద్: హైదరాబాద్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించి మంత్రి కెటిఆర్ సానుకూలంగా స్పందించారని టియూడబ్లూజే ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతిసాగర్ తెలిపారు. ప్రగతిభవన్‌లో శుక్రవారం తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణతో కలిసి ఈ విషయమై మంత్రి సుదీర్ఘంగా చర్చించారని ఆయన పేర్కొన్నారు.

హైదరాబాద్‌లోని జర్నలిస్టుల సంఖ్య ఎంత..? అర్హులైన జర్నలిస్టులు ఎంతమంది ఉన్నారు..? అందరికీ ఇళ్లు కేటాయించడానికి ఎంత స్థలం అవసరం అవుతుందన్న విషయాలను చర్చలో భాగంగా మంత్రి కెటిఆర్ ఆరా తీశారని ఆయన తెలిపారు. దీంతోపాటు జవహర్‌లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీకి సంబంధించిన స్థలాలను సభ్యులకు అప్పగించే విషయమై చర్చ జరగ్గా మంత్రి సానుకూలత వ్యక్తం చేశారని ఆయన పేర్కొన్నారు. నగరంలోని అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇళ్లు ఇచ్చే విధంగా వారం, పది రోజుల్లో పూర్తిస్థాయి స్పష్టతను ఇచ్చే దిశగా చర్చలు జరిగాయని, దీంతో హైదరా బాద్‌లో పనిచేస్తున్న దాదాపు నాలుగువేల మంది జర్నలిస్టులకు త్వరలో ఇళ్ల స్థలాల సమస్య పరిష్కార దిశగా ముందడుగు పడ్డట్లు అయ్యిందని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News