- Advertisement -
విజయవాడ మార్గంలో ప్రయాణించే ప్రయాణీకులకు తెలంగాణ ఆర్‌టిసి శుభవార్త చెప్పింది. హైదరాబాద్ విజయవాడ మార్గంలో ప్రత్యేక రాయితీలు ప్రకటించింది. ఈ విషయాన్ని టిజిఎస్ ఆర్‌టిసి ఎండి, విసి సజ్జనార్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. లహారి- నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో 10 శాతం, రాజధాని ఏసీ సర్వీసుల్లో 8 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈ డిస్కౌంట్ సదుపాయాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని సంస్థ కోరుతోందని తెలిపారు. టిజిఎస్ ఆర్‌టిసి బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం సంస్థ వెబ్‌సైట్ http://tgsrtcbus.in సందర్శించాలని సూచించారు. ఇప్పటికే మహా శివరాత్రి సందర్భంగా ఆర్‌టిసి ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.
- Advertisement -