Sunday, December 22, 2024

భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్‌లో ఉన్నత విద్యావకాశాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఫ్రాన్స్‌లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు ఆ దేశం తీపి కబురు చెప్పింది. 2030 నాటికి దాదాపు 30 వేల మంది విద్యార్థులను తమ దేశానికి ఆహ్వానించేందుకు సిద్ధమని ప్రకటించింది. ఇటీవల ఫ్రాన్స్‌లో పర్యటించిన ప్రధాని మోడీ ఆ దేశంతో అనేక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అందులో భాగంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఆదేశాల మేరకు ఆ దేశ రాయబార కార్యాలయం కార్యాచరణ ప్రారంభించింది. ఎక్కువ మంది భారతీయ విద్యార్థులను ఆకర్షించడానికి ఐదేళ్ల కాలపరిమితితో కూడిన షెంజెన్ వీసాను ఇవ్వనున్నట్టు తెలిపింది.

ఈ చర్య ద్వారా ఇరు దేశాల ప్రజల మధ్య స్నేహ సంబంధాలు బలోపేతం అవుతాయని ఆకాంక్షిస్తోంది. భారతీయ విద్యార్థుల కోసం ఫ్రాన్స్ ఇంటర్నేషనల్ క్లాసెస్ పేరిట ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనుంది. ఫ్రెంచి భాష, ఇతర విద్యా విభాగాల్లో సమగ్ర శిక్షణ ఇవ్వనుంది. త్వరలో ఫ్రెంచ్ రాయబార కార్యాలయం చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ, ముంబై నగరాల్లో ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించనుంది. అక్టోబర్ నెలలో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. 40 కి పైగా ఫ్రెంచ్ ఉన్నత విద్యాసంస్థల ప్రతినిధులు వీటికి హాజరు కానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News