Monday, January 20, 2025

ఎల్‌ఐసి ఏజెంట్లు, ఉద్యోగులకు గుడ్‌న్యూస్

- Advertisement -
- Advertisement -

పలు సంక్షేమ పథకాలకు ప్రభుత్వం ఆమోదం
న్యూఢిల్లీ : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసి) ఏజెంట్లు, ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. నాలుగు ప్రధాన పథకాలను కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ ఆమోదించింది. గ్రాట్యుటీ పరిమితులు, పునరుత్పాదక కమిషన్ అర్హత, టర్మ్ ఇన్సూరెన్స్ కవర్, వారికి కుటుంబ పెన్షన్ కోసం ఏకరీతి రేటును ఆమోదించింది. ఈ నిర్ణయంతో 1 లక్ష మంది రెగ్యులర్ ఉద్యోగులు, 13 లక్షల మంది ఏజెంట్లకు ప్రయోజనం చేకూరనుంది. దీని ద్వారా ఏజెంట్లు ఆర్థిక స్థిరత్వాన్ని పొందగలుగుతారని ఆర్థికమంత్రిత్వ శాఖ తెలిపింది. ఎల్‌ఐసి ఏజెంట్లు ఎల్‌ఐసి అభివృద్ధిలో భారతదేశంలో బీమా వ్యాప్తిని మరింతగా పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News