Tuesday, December 17, 2024

మద్యం ప్రియులకు శుభవార్త..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః రాష్ట్రంలోని మద్యం ప్రియులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల మద్యం బ్రాండ్లపై బారీగా ధరలు తగ్గించింది. తగ్గించిన ధరలు తక్షణమే అమలులోకి తేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఎక్సైజ్ శాఖ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం విధించే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో అన్ని రకాల బ్రాందీ, విస్కీ, రమ్ ధరలు భారీగా తగ్గాయి. క్వార్టర్ బాటిల్ పై రూ. 10, హాప్ బాటిల్‌పై రూ. 20, పుల్ బాటిల్‌పై రూ. 40లు తగ్గించారు. బీరు, రెడ్ టూ డ్రింక్ ధరలపై ఎలాంటి మార్పు లేదు. వివిద రకాల బ్రాండ్లపై 5 శాతం నుంచి గరిష్టంగా 10 శాతం వరకు ధరలు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎమ్మార్పీ ధరల లేబుళ్లపైన తగ్గించిన ధరల లేబుళ్లను అంటించాలని అన్ని డిపోల అధికారులను ఆదేశించారు. తగ్గించిన బ్రాండ్ల ధరల వివరాలను ఆ ఉత్తర్వుల్లో అబ్కారీశాఖ అధికారులు పేర్కొన్నారు.
తగ్గింపు ఇదే తొలిసారి ః
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించిన ప్రభుత్వాలన్ని మద్యం ధరలు పెంచడమే కానీ తగ్గించిన దాఖాలాలు లేవని, తెలుగు రాష్ట్రాల చరిత్రలో మొదటిసారిగా మద్యం ధరలను తగ్గిస్తూ బిఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని ఎక్సైజ్ శాఖలోని పలువురు సీనియర్ అధికారులు తెలిపారు. గతంలో మద్యం ధరలను ఖరారు చేసే సమయంలో ’లిక్కర్ రేట్స్ రివ్యూ’ ( మద్యం ధరల సమీక్ష) పేరుతో బారీగా ధరలు పెంచుకుంటూ పోయారే కానీ ఎన్నడూ తగ్గించలేదని ఆ అధికారులు వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవానికి పూర్వం మద్యంపై వచ్చే ఆదాయాన్ని పెంచుకునేందుకు అప్పటి ప్రభుత్వాలు ధరల సమీక్ష పేరుతో మందుబాబులు ఎక్కువగా ఇష్టపడే చిన్నచిన్న బ్రాండ్ల దరలను స్దీరికరించి మధ్యతరగతి, ధనవంతులు సేవించే బ్రాండ్లు, విదేశీ బ్రాండ్ల మద్యంపై 30 శాతం నుంచి 215 శాతం (కొన్ని విదేశీ బ్రాండ్లపై) వరకు ధరలు పెంచిన సందర్బాలున్నాయని,

కానీ ప్రస్తుతం ఏకవాక్యంగా అన్ని బ్రాండ్లకు ధరలు తగ్గించాలని నిర్ణయం తీసుకోవడం మొదటిసారి అని ఆ అధికారులు వెల్లడించారు. మద్యం ధరలు తగ్గించడం మూలంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజనాకు సుమారు రూ. వెయ్యి కోట్లవరకు ఆదాయం తగ్గుతుందని ఆ అదికారులు వివరించారు. నేడు ఉన్న ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మరే ఇతర ప్రభుత్వమైనా మద్యం ధరలు పెంచుతారే తప్ప తగ్గించరని ఆ అధికారులు అభిప్రాయపడ్డారు. ధరలు తగ్గించడంతో ఖజానాకు ఆదాయం తగ్గుతుందని తెలిసినప్పటికి ప్రజల ఆర్ధిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించినట్లుగా ఉందని వివరించారు. ప్రభుత్వ ఖజానాకు నిధులను సమకూర్చుకోవడానికి మద్యం అమ్మకాలపైన ఆధారపడటం లేదని ఈనిర్ణయంతో బిఆర్‌ఎస్ ప్రభుత్వం నిరూపించిందని వారు సంతోషం వ్యక్తం చేశారు. గడిచిన 30 ఏళ్లలో తాము సర్వీసులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఏ ఒక్క ప్రభుత్వం మద్యం ధరలను సమీక్షించారే కానీ నేరుగా ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకోలేదని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News