- Advertisement -
న్యూఢిల్లీ : ఇకపై టోల్ బూత్‌ల వద్ద అర నిమియం కూడా వాహనాలు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం త్వరలో అడ్డంకులు లేని టోలింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకు రానుంది. ఈ కొత్త విధానంపై ట్రయల్స్ జరుగుతున్నాయని, త్వరలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టనున్నామని బుధవారం కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ సహాయ మంత్రి వికె సింగ్ వెల్లడించారు. దేశంలో ప్రయాణించిన కిలోమీటర్ల ఆధారంగా చెల్లింపు విధానాన్ని కూడా అనుసరించాలని ఆయన అన్నారు. కొత్త ఓలింగ్ విధానంతో సామర్థం పెరగనుందని, ప్రయాణ సమయం తగ్గుతుందని ఆయన వివరించారు. టోల్ ప్లాజాల వద్ద వేచిఉండే సమయాన్ని ఫాస్టాగ్ తగ్గిస్తుందని అన్నారు.
- Advertisement -