Monday, December 23, 2024

వాహనదారులకు గుడ్‌న్యూస్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు కట్టే వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. 2023 డిసెంబర్ 26వ తేదీ నుండి ఈ ఏడాది జనవరి 10వ తేదీ వరకు పెండింగ్ చలాన్ల రాయితీ ఇస్తున్నట్టుగా గత ఏడాది డిసెంబర్ 26వ తేదీన తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ చలాన్ల చెల్లింపునకు రాయితీ ఇవ్వడంతో పెండింగ్ చలాన్ల చెల్లింపునకు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఈ కార్యక్రమానికి ప్రజల నుండి పెద్ద ఎత్తున స్పందన వస్తున్న నేపథ్యంలో ఈ రాయితీ గడువును ఈనెల 31 వరకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెండింగ్ చలాన్ల చెల్లింపులు ద్వారా ఇప్పటికే రూ.107 కోట్ల ఆదాయం వచ్చి నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్ల పెండింగ్ చలాన్లను వాహనదారులు చెల్లించినట్లు పేర్కొన్నారు.

ఈ మేరకు పెండింగ్ చలాన్ల చెల్లింపులకు స్పందన వస్తుండడంతో గడువును మరో 20 రోజులు పెంచారు. మొత్తం 3.59 కోట్ల ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. సాంకేతిక సమస్యలతో చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయని పోలీసులు వెల్లడించారు. అంతకు ముందు రాయితీపై పెండింగ్ చలాన్ల చెల్లింపుల గడువును పెంచాలని పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే చలాన్లను కట్టేందుకు విశేష స్పందన రావడంతో గడువును పెంచాలనుకున్నారు. వీటితో పాటు సాంకేతిక సమస్యలు ఎదురవడంతో చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయని రవాణా శాఖ పేర్కొంది. తెలంగాణలో రోజు ట్రాఫిక్ ఉల్లంఘనలు కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. గతేడాది 2023 గణాంకాల ప్రకారం రాష్ట్రంలో సగటున ప్రతి గంటకు 1,731 చొప్పున ట్రాఫిక్ ఉల్లంఘనలు జరిగాయని రవాణా శాఖ వెల్లడించింది. గత సంవత్సరం 1,51,63,986 కేసులు నమోదయ్యాయి. వీటికి విధించిన జరిమానాలు రూ.519 కోట్లు పైమాటే.

కాగా, 2022లో పెండింగ్ చలాన్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ . 300 కోట్ల మేరకు ఆదాయం వచ్చింది. అయితే ఈ ఏడాదిలో ఇప్పటికే రూ. 107 కోట్ల ఆదాయం వచ్చింది. పెండింగ్ లో ఉన్న చలాన్లు ఇంకా రెండు కోట్ల వరకు ఉన్నాయి.దీంతో గడువును పెంచింది ప్రభుత్వం. మరో వైపు సైబర్ నేరగాళ్లు పెండింగ్ చలాన్ల కోసం ఫేక్ వెబ్ సైట్ ను క్రియేట్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ విషయమై అప్రమత్తంగా ఉండాలని పోలీస్ శాఖ సూచించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News