Friday, November 22, 2024

కొత్త రేషన్‌కార్డులపై ఈ నెల నుంచే బియ్యం

- Advertisement -
- Advertisement -

Good news for new ration card holders

 మూడో తేదీ నుంచి ఒక్కొక్కరికి
10కిలోలు కేంద్రం ఇచ్చే
5కిలోలకు అదనంగా మరి 5
కిలోలు నవంబర్ వరకూ
కొనసాగింపు : మంత్రి గంగుల

హైదరాబాద్ : కొత్త రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ నెల నుంచే రేషన్ అందించనున్నామని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా 3వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బియ్యం పంపిణి ప్రక్రియ ప్రారంభం కానుందని వెల్లడించింది. ఇందుకు సర్వం సిద్దమయిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు తాజాగా రాష్ట్రoలో అర్హులైన సుమారు 3,09,083 కొత్త కార్డుల్లోని 8.65 లక్షల లబ్దిదారులకు ఈ నెల నుంచి ఒక్కొక్కరికి 10 కిలొల బియ్యం చొప్పున సరఫరా చేయనున్నామని మంత్రి తెలిపారు. ఈ ప్రక్రియ నవంబర్ మాసం (నాలుగు నెలల పాటు) వరకు పూర్తి ఉచితంగా అందించనున్నామన్నారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం అదనంగా నెలకు రూ.23.10 కోట్లతో 4 నెలలకు రూ.92.40 కోట్లు మేర అదనంగా ఖర్చు చేయనుoదని శనివారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో మంత్రి గంగుల పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పిఎంజికెఎవై పథకం క్రింద ఒక్కోక్కరికి 5 కిలోల చొప్పున రాష్ట్రంలోని 53.56 లక్షల ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ కార్డుదారులకు, 33.85 లక్షల రాష్ట్ర కార్డుదారులకు గత మే,జూన్ రెండు నెలలుగా ఉచిత రేషన్ అందించిన విషయం తెలిసిందేనన్నారు. జూలైకు సంబందించిన పంపిణీ ఏర్పాట్లు ముగిసిన తర్వాత ( 24.6.2021) కేంద్రం నుండి ఉచిత రేషన్ పొడిగింపుపై అధికారిక సమాచారం అందడంతో జూలైలో ఇవ్వవలిసిన 5కిలోల ఉచిత బియ్యాన్ని ఆగస్టు, 2021 కోటా 10 కిలోలకు కలిపి అదనంగా మొత్తం 15 కిలోలు పంపిణి చేయడం జరుగుతుందన్నారు.

ఇందుకుగాను 87.41 లక్షల పాత కార్డుల్లోని దాదాపు 2.80 కోట్ల లబ్దిదారులకు 7 నెలల కోసం రూ.323.94 కోట్లు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనుందన్నారు. దీంతో రాష్ట్రంలోని మొత్తం 90.50 లక్షల కార్డుల్లోని 2.88 కోట్ల లబ్దిదారులకు ఉచిత బియ్యం పంపిణికిగాను రాష్ట్ర ప్రభుత్వం మొత్తగా రూ.416.34 కోట్లు అదనంగా ఖర్చు చేయనుందన్నారు. కొత్త రేషన్ కార్డుల జారీ, అదనపు బియ్యాన్ని చౌకధరల దుకాణాలకు తరలిoచవలసి ఉన్నందున ఈ నెల 3వ తేది నుండి బియ్యం పంపిణి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నామని మంత్రి గంగుల తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News