రుణమాఫీ కాని రైతులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో చెప్పినట్లుగా మూడు విడతల్లో ప్రభుత్వం రుణమాఫీ చేసింది. అయితే, చాలా మంది రైతులు తమకు మాఫీ కాలేదంటూ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన సర్కార్.. పలు టెక్నికల్ సమస్యల కారణంగా కొంతమంది రైతులకు మాఫీ కాని మాట వాస్తవమేనని తెలిపింది.
సర్కార్ ఆదేశాల మేరకు సమస్యలపై చర్యలు చేపట్టిన అధికారులు.. రుణమాఫీ కాని రైతులకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించారు. రేషన్ కార్డు లేకపోవడంతో 4 లక్షల మందికిపైగా అన్నదాతలకు మాఫీ కాలేదని గుర్తించారు. ఆధార్, బ్యాంక్ అకౌంట్ల పేర్లలో తప్పుల వల్ల మాఫీ కాని మరో 1.50లక్షల మందిని నిర్ధారించారు. మొత్తం 5 లక్షలకుపైగా అర్హుల జాబితాను సిద్ధం చేశారు. ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగానే వారి అకౌంట్లలో రూ.5వేల కోట్లను జమ చేయనున్నట్లు తెలుస్తోంది.