Saturday, January 4, 2025

ప్రయాణికులకు దక్షిణమధ్య రైల్వే గుడ్ న్యూస్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రయాణికులకు దక్షిణమధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్ నుంచి మరో ప్రత్యేక రైలు అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైలు (07018) ను ఏప్రిల్ 2న సికింద్రాబాద్ నుంచి అగర్తలకు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు నేడు ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి ఏప్రిల్ 4వ తేదీన మంగళవారం రాత్రి 11.15 గంటలకు అగర్తలకు చేరుకోనుంది. నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ, విశాఖ పట్నం, విజయనగరం,

శ్రీకాకుళం రోడ్డు, బెర్హంపూర్; ఖుర్డారోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలసోర్, ఖరగ్ పూర్, దంకుని, రాంపూర్ హట్, మల్దా టౌన్, కిషన్, గంజ్, న్యూ జలపాయిగురి, న్యూకూచ్ బెహార్, న్యూ అలీపురందర్, న్యూ బంగోయ్ గాన్, వయా గాల్ పరా టౌన్, కామాఖ్య, గువాహటి, న్యూ హాఫ్ లాంగ్, బదర్ పూర్ జంక్షన్, న్యూ కరీంగంజ్, ధర్మసాగర్, అంబసా స్టేషన్‌ల మీదుగా ఈ రైలు నడువనుంది. ప్రయాణికులు ఈ కొత్త రైలు సేవలను వినియోగించుకోవాలని రైల్వే అధికారులు కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News