Sunday, December 22, 2024

పిఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి(ఇపిఎఫ్)ఖాతాల్లో ని నిల్వలపై వడ్డీ రేటు ఖరారయింది. 2023 24 ఆర్థిక సంవత్సరానికి గాను 8.25 శాతం వడ్డీ రేటును నిర్ణయించారు.ఈ మేరకు శనివారం కేంద్ర కార్మిక మంత్రి భూపేంద్ర యాదవ్ అధ్యక్షతన జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఇపిఎఫ్‌ఓ వర్గాలు వెల్లడించాయి. గత మూడేళ్లలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. 2019 20లో 8.5 శాతం వడ్డీ చెల్లించగా, ఆ తర్వాతి సంవత్సరం కూడా దాన్నే కొనసాగించారు. అయితే 2021 22 ఆర్థిక సంవత్సరంలో వడీ ్డరేటును 8.1 శాతానికి తగ్గించారు. నాలుగు దశాబ్దాల్లో పిఎఫ్ వడ్డీ రేటు ఇంత తక్కువగా ఉండడం ఇదే మొదటి సారి. అయితే 2022 23 ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రేటును 8.15 శాతానికి పెంచిన విషయం తెలిసిందే.

అయితే ఈ సారి గత ఏడాదికంటే తక్కువగా పిఎఫ్ నిల్వలపై వడ్డీ రేటును 8 శాతంగా నిర్ణయించవచ్చంటూ వచ్చిన వార్తలకు భిన్నంగా వడ్డీ రేటును పెంచడం గమనార్హం. ఎన్నికల సంవత్సరం అయిన నేపథ్యంపై ప్రభుత్వంపై ఎలాంటి వ్యతిరేక ప్రభావం పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇపిఎఫ్‌ఓలో దాదాపు ఆరు కోట్ల చందాదారులున్నారు. ఇపిఎఫ్‌ఓ ట్రస్టు బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు తెలియజేస్తారు. ఆర్థిక శాఖ ఆమోదం లభించిన తర్వాత అధికారిక గెజిట్ వెలువడుతుంది. అటుపై సబ్‌స్ర్కైబర్ల ఖాతాల్లో పెరిగిన వడ్డీ మేరకు క్రెడిట్ అవుతుందని ఇపిఎఫ్‌ఓ ఆ ప్రకటనలో తెలియజేసింది.2024 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.13 లక్షల కోట్ల మూలధనంపై ఇపిఎఫ్‌ఓ ఖాతాదారుల ఖాతాల్లోకి రూ.1,07,000 కోట్లు పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు ఇపిఎఫ్‌ఓ ఆ ప్రకటనలో తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News