Friday, November 15, 2024

పోలీసు అభ్యర్థులకు గుడ్ న్యూస్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : పోలీసు ఉద్యోగాల కోసం నిర్వహించిన దేహదారుడ్య పరీక్షల్లో 1సెం.మీ తక్కువ ఎత్తుతో అనర్హత పొందిన వాళ్లకు పోలీస్ నియామక మండలి మరో అవకాశాన్ని కల్పించింది. హైకోర్టు ఆదేశాలతో ఆయా అభ్యర్థులకు తిరిగి మరోసారి ఎత్తును కొలవాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని అంబర్ పేట సిపిఎల్ మైదానం, కొండాపూర్‌లోని 8వ పోలీస్ బెటాలియన్ మైదానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. అర్హత గల అభ్యర్థులు ఈ నెల 10వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 12వ తేదీ రాత్రి 8 గంటల వరకు పోలీస్ నియామక మండలి వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోర్టు సూచించింది.

ఆన్‌లైన్ చేసిన పత్రాలను డౌన్‌లోడ్ చేసుకొవాలని అధికారులు సూచించారు. తిరిగి ఎత్తు కొలిచే ప్రక్రియలో అభ్యర్థులు దరఖాస్తు పత్రాలను తీసుకురావాలని అధికారులు సూచించారు. ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పోలీస్ నియామక మండలి దేహదారుడ్య పరీక్షలు నిర్వహించింది. ఈ క్రమంలో నిర్దేశించిన ఎత్తుకంటే 1 సెం.మీ తక్కువ ఎత్తు ఉన్న వాళ్లను అనర్హులుగా ప్రకటించారు. దీంతో ఆయా అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. సదరు అభ్యర్థుల ఎత్తును మరోసారి కొలవాలని హైకోర్టు ఆదేశించడంతో పోలీస్ నియామక మండలి ఆ మేరకు ఏర్పాట్లు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News