Monday, December 23, 2024

ఆగస్టు నుంచి ఇండ్ల పండుగ

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో ః సొంతింటి కోసం సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న గ్రేటర్ హైదరాబాద్‌లోని నిరుపేదలకు పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు శుభవార్త చెప్పారు. గ్రేటర్ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని అర్హులైన లబ్ధిదారులకు అందించే కార్యక్రమానికి ప్రభుత్వం త్వరలో శ్రీకారం చుట్టబోతున్నటు మంత్రి తెలిపారు. అగస్టు మొదటి వారం మొదలు అక్టోబర్ ముడవ వారం లోపు గ్రేటర్ వ్యాప్తంగా 70 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. గ్రేటర్‌లోని నిరు పేదల కోసం జిహెచ్‌ఎంసి ఆధర్యంలో చేపట్టిన లక్షా డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాన్ని 80 శాతానికి పైగా పూర్తి కాగా మిగిలిన చోట్ల నిర్మాణ పనులు తుది దశలో చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఇప్పటికే నిర్మాణం పూరైన డబుల్ బెడ్ రూంఇండ్లను అర్హులైన లబ్ధిదారులకు అందజేసేందుకు జిహెచ్‌ఎంసి షెడ్యూల్ సిద్ధం చేసింది. ఇందులో భాగంగా లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమానికి సంబంధించిన అంశంలో రెవెన్యూ యంత్రాంగం నుంచి మద్దతు తీసుకొని ముందుకుపోనున్నది.

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం లబ్ధిదారుల ఎంపికను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఇచ్చిన మార్గదర్శకాలు మేరకు ఈ ఎంపిక ప్రక్రియను పకడ్బందీగా చేపట్టేందుకు అధికారులు నిర్ణయించారు. ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందేలా చూడాలని పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిహెచ్‌ఎంసి అధికారులకు ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి జిహెచ్‌ఎంసి పరిధిలో ఉన్న జిల్లా కలెక్టర్ల సహకారం తీసుకోవాలని సూచించారు. మంత్రి అదేశాల మేరకు జిహెచ్‌ఎంసి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీకి సంబంధించిన కార్యచరణను సిద్దం చేసింది. (ఇన్ సిట్యూ) మురికివాడల స్థానలో నిర్మించిన దాదాపు 4 వేల పైగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇప్పటికే పేదలకు అందించారు.

. జిహెచ్‌ఎంసి రూపొందించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ షెడ్యూల్ ప్రకారం ఆగస్టు మొదటి వారంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ ప్రారంభం అవుతుంది. అక్టోబర్ మూడవ వారం వరకు కొనసాగుతుంది. దాదాపు 6 దశల్లో ఇప్పటికే పూర్తయిన సుమారు 70 వేల కు పైగా పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పేదలకు అందించనున్నారు. నిర్మాణం తుది దశలో ఉన్న ఇండ్లను కూడా పూర్తి అయిన వెంటనే ఎప్పటికప్పుడు పంపిణీ చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News