Monday, December 23, 2024

రైల్వే ప్రయాణికులకు శుభవార్త

- Advertisement -
- Advertisement -

కిషన్‌రెడ్డి చొరవతో వివిధ రైల్వే స్టేషన్లలో ఆగనున్న ముఖ్యమైన రైళ్లు

మనతెలంగాణ/ హైదరాబాద్ : సుదూర ప్రాంతాలకు వెళ్లే పలు ముఖ్యమైన రైళ్లను తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ముఖ్యమైన స్టేషన్లలో ఆపాలంటూ దీర్ఘకాలంగా రెండు రాష్ట్రాల ప్రజలు చేస్తున్న డిమాండ్లపై రైల్వే మంత్రిత్వశాఖ సానుకూలంగా స్పందించింది. తన దృష్టికి వచ్చిన డిమాండ్లపై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి .. కొద్ది రోజుల కిందటే రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి ఆయా స్టేషన్లలో వివిధ ముఖ్యమైన రైళ్లను ఆపడం ద్వారా ప్రజలకు కలిగే సౌకర్యం గురించి వివరించారు. దీనిపై అధికారులతో మాట్లాడిన రైల్వే మంత్రి.. ఈ డిమాండ్లకు అంగీకరిస్తూ ఆయా రైల్వే స్టేషన్లలో వివిధ ప్రధానమైన రైళ్లను నిలపనున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. తెలంగాణలోని బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్ నగర్, మహబూబ్ నగర్, షాద్‌నగర్, డోర్నకల్, గద్వాల్ రైల్వేస్టేషన్లలో, ఆంధ్రప్రదేశ్‌లోని పిడుగురాళ్ల, నడికుడి, సత్తెనపల్లి, బొబ్బిలి. దువ్వాడ, పీలేరు స్టేషన్లలలో వివిధ రైళ్లను ఆపనున్నట్టు రైల్వేశాఖ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News