- Advertisement -
ముంబై : షిర్డీ సాయిబాబా భక్తులకు శుభవార్త. బాబా ఆలయంలో సమాధిని చేతితో తాకి దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదివరకు బాబా విగ్రహాన్ని దూరం నుంచి దర్శించుకుని బయటకు వెళ్లేవారు. విగ్రహం ఎదురుగా ఉన్న సమాధి చుట్టూ అమర్చిన అద్దాల ఫ్రేమ్ వల్ల తాకేందుకు వీలు లేకుండా ఉండేది.
దీంతో సమాధి చుట్టూ అమర్చిన ఫ్రేమ్‌ను తొలగించాలని బాబా సంస్థాన్ యాజమాన్యం, షిర్డీ గ్రామస్తుల మధ్య జరిగిన సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో సాయి భక్తులకు గతంలో మాదిరిగా సమాధిని చేతులతో తాకి దర్శించుకునేందుకు వీలు లభించనుంది. భక్తుల రద్దీని తగ్గించడానికి వీలుగా ద్వారకామాయి ఆలయం లోకి రెండు దిశల నుంచి భక్తులను అనుమతించడానికి చర్యలు తీసుకున్నారు. సాయి సచ్చరిత పారాయణాన్ని ఇతర భాషల్లోకి అనువదిస్తున్నారు.
- Advertisement -