Monday, December 23, 2024

జోన్న రైతుకు శుభవార్త..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో జోన్న రైతుకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది.యాసంగి వ్యవసాయ సీజన్‌లో పండించిన జొన్నలను రైతులనుంచి కనీస మద్దతు ధరలు చెల్లించి పూర్తి స్ధాయిలో కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఇందుకోసం మార్క్‌ఫెడ్‌ను రాష్ట్ర నోడల్ ఏజెన్సీగా నియమిస్తూ 202223 యాసంగి సీజన్‌లో పండించిన జొన్న (హైబ్రిడ్) పంటను మద్దతు ధరలకు కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు అవసరమైన చర్యలను వెంటనే చేపట్టాలని మార్క్‌ఫెడ్ ఎండిని ఆదేసించింది.

Also Read: కలెక్టరేట్ ఎదుట వృద్దుడి ఆత్మహత్యాయత్నం

యాసంగి సీజన్‌లో ఎకరానికి సగటు దిగుబడిగా 5.16 క్వింటాళ్లు అంచనా వేసి ఆ మేరకు రైతులు పండించిన 65,494 మెట్రిక్ టన్నుల జొన్న పంటను కొనుగోలు చేసేందుకు కావాల్సిన రూ.219.92కోట్ల రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకు గ్యారెంటీ ఇవ్వనుంది. తద్వారా ముఖ్యంగా అదిలాబాద్, ఆసీఫాబాద్, నిర్మల్ , కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట్, గద్వాల, జిల్లాల పరిధిలో జొన్న పంటను పండించిన సుమారు లక్ష మంది రైతులకు ముఖ్యమంత్రి కేసిఆర్ తీసుకున్న నిర్ణయం వల్ల లబ్ది చేకూరనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News