Thursday, January 2, 2025

టెక్ ప్రియులకి గుడ్ న్యూస్..త్వరలో రిలీజ్ కానున్న మొబైల్స్ ఇవే..

- Advertisement -
- Advertisement -

కొన్ని రోజుల్లో 2025 సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. టెక్నాలజీ పరంగా చూస్తే ఈ ఏడాది చాలా ప్రత్యేకమైనది అని చెప్పవచ్చు. ఎందుకంటే మార్కెట్లో అనేక రకాల కంపెనీల ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్ రీలీజ్ అయినవి. ఇక వచ్చే 2025లో కూడా వివిధ రేంజ్‌ల్లో ఫోన్‌లను విడుదల చేసేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది మార్కెట్లోకి రిలీజ్ కానున్న మొబైల్స్ జాబితా గురుంచి మనం ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్

శాంసంగ్ గెలాక్సీ సిరీస్‌కి ఈ ఏడాదిలో మొదటి నెల అంటే జనవరి ప్రత్యేకమైనది. ప్రతి ఏడాదిలాగే శాంసంగ్ జనవరిలో కొత్త శ్రేణిని విడుదల చేయనున్నది. కాగా,గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ జనవరి 22న జరగనున్నది. గెలాక్సీ S25, శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్, శాంసంగ్ S25 స్లిమ్, శాంసంగ్ S25 అల్ట్రా ఫోన్లను ఇందులో విడుదల చేయనున్నారు. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ సిరీస్‌లో అందుబాటులో ఉంటుంది.

వన్ ప్లస్ 13, 13R

వన్ ప్లస్ 13, 13R స్మార్ట్ ఫోన్స్ వచ్చే ఇద్ధి జనవరి 7న మార్కెట్లో విడుదల కానున్నాయి. వన్ ప్లస్ 13 స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌ను కలిగి ఉటుంది. ఇది 2K రిజల్యూషన్‌తో 6.8 అంగుళాల LTPO అల్మొడ్ డిస్‌ప్లేను కలిగి ఉండవచ్చు. ఇక ఫోటో గ్రాపి కోసం.. ఫోన్‌లో 50MP హాసెల్‌బ్లాడ్ ట్రిపుల్ కెమెరా సిస్టమ్ ఉండే అవకాశం ఉంది. ఇది 6,000mAh బ్యాటరీని కలిగి ఉండవచ్చు. మరోవైపు.. వన్ ప్లస్ 13R స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్‌ని కలిగి ఉండవచ్చు. ఈ ఫోన్ 50MP ప్రైమరీ కెమెరాతో వస్తుంది. ఇది 80W ఛార్జింగ్ మద్దతుతో 6,000 mAh బ్యాటరీని కలిగి ఉండవచ్చు.

రియల్ మీ14 ప్రో సిరీస్

రియల్ మీ14 ప్రో సిరీస్‌లో రియల్ మీ14 ప్రో, రియల్ మీ14 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్ మోడల్‌లు విడుదల కానున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లు ట్రిపుల్ ఫ్లాష్ సెటప్, వెనుక భాగంలో రంగు మారుతున్న డిజైన్‌తో అమర్చబడి ఉంటాయి.ఈ ఫోన్స్ 6.7-అంగుళాల అల్మొడ్ డిస్‌ప్లేను కలిగి ఉండవచ్చు. పనితీరు కోసం.. స్నాప్ డ్రాగన్ 7s Gen3 ప్రాసెసర్‌ని కలిగి ఉండవచ్చు.

రెడ్ మీ14సి 5జి

రెడ్ మీ14సి 5జి వచ్చే ఏడాది జనవరి 6, ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కానుంది.ఈ ఫోన్‌లో 6.68 అంగుళాల డిస్‌ప్లే ఉండవచ్చు. ఇందులో స్నాప్‌డ్రాగన్ 4 Gen2 ప్రాసెసర్ ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ 5G సిమ్ సపోర్ట్ ఉండవచ్చు. అలాగే ఇది 5,160mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

ఒప్పో రెనో 13 5జి సిరీస్

ఒప్పో రెనో 13 5జి సిరీస్ జనవరిలో ఇండియన్ మార్కెట్లో విడుదల కానున్నాయి. ఈ సిరీస్‌లో రెనో 13 5జి ఫోన్, రెనో 13 ప్రో 5జి ఉన్నాయి. రెండు మోడల్స్‌లో MediaTek డైమెన్సిటీ 8350 చిప్‌సెట్తో రానున్నాయి. ఈ ఫోన్స్ 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.83-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

 

పోకో X7 సిరీస్, పోకో X7 నియో

పోకో X7, పోకో X7 Pro ఫోన్స్ పోకో X7 సిరీస్‌లో ఇండియన్ మార్కెట్లో విడుదల కానున్నాయి. జనవరి 9న ఏవి లాంచ్ కానున్నాయి. ఈ సిరీస్‌లో 50MP ప్రధాన సెన్సార్, 90W ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,550mAh బ్యాటరీ ఉంటుంది.పోకో X7 నియో, డైమెన్సిటీ 7025 అల్ట్రా చిప్‌సెట్‌ని కలిగి ఉండవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లో 6.72 అంగుళాల అల్మొడ్ డిస్‌ప్లే ఉండవచ్చు. ఈ ఫోన్స్ 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. పోకో X7 నియో 50MP ప్రధాన కెమెరా తో వస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News