ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైతులకు శుభవార్త అందించారు. రైతు రుణమాఫీపై ఆయన కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 15వ తేదీ లోపు రూ. 2 లక్షణ రుణమాఫీ పూర్తి చేస్తామని రేవంత్ రెడ్డి మరోసారి రైతులకు ధీమా ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి ఇదేమాట చెబుతున్నానని, రైతులకు రుణమాఫీ పూర్తి చేసే వరకు ఇదే మాట మీద ఉంటానని ఆయన వెల్లడించారు. దీనిపై మరో రెండ్రోజుల్లో రుణమాఫీ విధి,విధానాలను ప్రకటించుతామని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం రైతు రుణమాఫీ అమలు కోసం అధికారులు మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. మార్గదర్శకాలు ప్రకటించిన వాటికి అనుగుణంగా అర్హుల జాబితాను సిద్ధం చేస్తామన్నారు. ఇక రైతుల రుణాలు మాఫీ చేయడానికి రోజులే మిగిలుందని రోజుల వ్యవధిలోనే ఇది జరిగిపోతుందని ఆయన తెలిపారు. అలాగే రుణమాఫీ కోసం 32 వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇందులో రూ. 10 వేల కోట్లను సిద్ధం చేశామని ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు.