Monday, December 23, 2024

తెలంగాణ పోలీసులకు శుభవార్త

- Advertisement -
- Advertisement -

తెలంగాణ పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. పోలీస్ సిబ్బందికి సరెండర్ లీవ్‌ల బడ్జెట్ రూ.182. 48 కోట్లను తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసింది. పోలీస్ సిబ్బందికి సరెండర్ లీవ్‌లకు సంబంధించిన బడ్జెట్‌ను రేవంత్ ప్రభుత్వం భారీ స్థాయిలో విడుదల చేసింది. 182.48 కోట్ల రూపాయల మొత్తాన్ని పోలీస్ సిబ్బందికి మంజూరు చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ఎంతో కాలంగా పోలీస్ సిబ్బంది ఎదురు చూస్తున్న సరెండర్ లీవ్‌లకు సంబంధించిన బడ్జెట్‌ను విడుదల చేయడంపై పోలీస్ అధికారుల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మిగిలిన బకాయిలను దశలవారీగా త్వరితగతిన మంజూరు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. మరోవైపు పోలీసు సిబ్బందికి ‘సరెండర్’ డబ్బులు సకాలంలో అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారాలు, సెలవులు, పండగలు, ఇతర ముఖ్యదినా ల్లో సైతం పోలీసులు విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

దానికోసం వారికి సరెండర్ (ప్రభుత్వ ఉద్యోగుల్లో కొన్ని విభాగాలకు వర్తిస్తుంది) పద్ధతి ద్వారా సెలవులు లేదా డబ్బులు ఇస్తుంటారు. అంటే ప్రతి ఏడాది రెండు సరెండర్‌లు ఉంటాయి. ఒక్కో సరెండర్ ద్వారా 15 రోజుల జీతం అద నంగా ఇస్తుంటారు. వీటిని జనవరి – జూలై నెలల్లో అందజేస్తారు. దానికి తోడు వారికి ప్రతి ఏడాది జమయ్యే 30 ఈఎల్స్ (ఎర్న్‌డ్ లీవ్స్)లో 15 రోజులకు ఎన్‌క్యాష్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అంటే నవంబర్‌లో 15 రోజుల సెలవులకు సంబంధించి ఎన్‌క్యాష్ చేసుకుంటే వారికి ఆ డబ్బు కూడా ఇస్తారు. అయితే గతేడాది జూలై, నవంబర్, ఈ ఏడాది జనవరికి సంబంధించిన డబ్బులు చాలా మంది పోలీసు సిబ్బందికి అంద లేదు. పోలీస్ ఉద్యోగం అంటే కత్తిమీద సాములాంటిది. ఎప్పుడు ఏ ఉపద్రవం వస్తుందోనని నిత్యం అలర్ట్‌గా ఉండాలి. ఇతర ఉద్యోగుల మాదిరిగా వీరికి పండగలు, ఆదివారం సెలవులు ఉండవు. నెలలో 30 రోజులూ డ్యూటీలో ఉండాల్సిందే.

అందుకే వీరికి ప్రభుత్వం ప్రోత్సాహకంగా సరెం డర్ లీవ్స్ పేరుతో ప్రోత్సాహకం అందిస్తోంది. ఉద్యోగుల సీనియారిటీని బట్టి బేసిక్‌పై సరెండర్స్ ఇస్తారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం మూడు సరెండర్స్ పెండింగ్‌లో పెట్టింది. పోలీస్ ఉద్యోగులు వాటికోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ మైనా వీటిని మంజూరు చేస్తుందన్న ఆశతో పోలీసులు ఎదురుచేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో దాదాపు 3,000 మంది పోలీసులు ఉన్నారు. వీరికి బేసిక్ ప్రకారం మూడు సరెండర్స్ పెండింగ్‌లో ఉండగా, జనవరితో నాలుగో సరెండర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి తోడు ఆరు నెలలుగా టిఎ, నాలుగేళ్లుగా డిఎలు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలా ఒక్కో ఉద్యోగికి రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు రావాల్సి ఉంది. కాగా, సరెండర్స్ కమ్రం తప్పకుండా చెల్లిస్తే పిల్లల చదువులు, వైద్య ఖర్చు లకు ఉపయోగపడతాయని చాలామంది పోలీసులు భావిస్తున్నారు.

పెండింగ్‌లో ఉన్న బకాయిలు వస్తే తమ అవసరాలకు వాడుకుంటా మని బిఆర్‌ఎస్ ప్రభుత్వంలోని పెద్దలందరి చుట్టూ తిరిగినా పట్టించుకోలేదని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు. అవి వస్తే ఆస్పత్రిలో వైద్యం చేయి ంచుకోవడానికో, పిల్లలకు ఉన్నత చదు వులకో, వాహన కొనుగోళ్లకో ఉపయోగపడతాయని చాలామంది ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నా రు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సరెండర్స్‌పై ఆశలు చిగురిస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే ఈ ప్రక్రియను ప్రారంభించిందని, తొం దరలోనే వచ్చే అవకాశం ఉందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులుగా ఎంపికై ట్రాన్స్‌కో, టెలికాం, ఆర్టీసీ, రవాణా శాఖల్లో పనిచేస్తున్న వారికి సరెండర్స్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. తమకూ వస్తాయని పోలీసులు ఆశిస్తున్నారు. ఇప్పుడు సరెండర్ లీవ్‌ల బడ్జెట్ రూ.182.48 కోట్లను తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేయడంతో పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News