Thursday, November 14, 2024

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో రైల్వేలైన్ల అభివృద్ధికి సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గుంటూరు -బీబీనగర్ మధ్య ప్రస్తుతం ఉన్న సింగిల్ లైన్‌లో 239 కిమీ రైల్వే లైన్ డబ్లింగ్‌కు ఆమోదం తెలిపిన కేంద్రం, దీనికోసం రూ. 3238 కోట్లు ఖర్చు చేయనుంది. అలాగే హైదరాబాద్‌చెన్నై మధ్య 76 కిమీ దూరం తగ్గనుంది. మరోవైపు రూ. 5655.4 కోట్ల అంచనా వ్యయంతో ముద్కేడ్‌మేడ్చల్, మహబూబ్‌నగర్‌డోన్ మధ్య రైల్వేలైన్ ( 502. 34 కిమీ ) డబ్లింగ్‌కు ఆమోదం లభించింది.

తద్వారా హైదరాబాద్‌బెంగళూరు మధ్య 50 కిమీ దూరం తగ్గనుంది. మరోవైపు ఏపీలో నెర్గుండి బారాంగ్, ఖుర్దారోడ్ విజయనగరం మధ్య (417.6 కిమీ)రూ. 5618 26 కోట్ల అంచనా వ్యయంతో మూడో రైల్వేలైన్ నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. అలాగే విశాఖ పట్నంచెన్నై మధ్య మూడోరైల్వే లైన్ డీపీఆర్ సిద్ధం కాగా, మూడు వేల కోట్ల ఖర్చుతో నిర్మాణ పనులు జరగనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News