తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రెండు రాష్ట్రాల్లో రోడ్ల అభివృద్ధి కోసం నిధులు కేటాయించింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు రూ. 498 కోట్లు కేటాయించగా తెలంగాణకు రూ. 516 కోట్ల నిధులను విడుదల చేసింది. ఎపిలో 200.06 కిలోమీటర్ల పొడవైన 13 రాష్ట్ర రహదారులకు కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి నుంచి ఈ నిధులను కేటాయించింది. గుంటూరు టు- నల్లపాడు రైల్వే మార్గంలో శంకర్ విలాస్ ఆర్‌ఓబిని నాలుగు వరుసల నిర్మాణానికి సంబంధించి రూ.98 కోట్లను కేటాయించగా తెలంగాణలో ఎన్‌హెచ్ 565లోని నకిరేకల్ -టు నాగార్జున సాగర్‌ల మధ్య 14 కిలోమీటర్ల పొడవు, నాలుగు -లేన్‌ల బైపాస్ నిర్మాణానికి రూ.516 కోట్లను కేంద్రం మంజూరు చేసింది.
నకిరేకల్ -టు నాగార్జున సాగర్‌ల మధ్య బైపాస్ రోడ్డు నిర్మాణంతో నల్గొండ టౌన్‌కు ట్రాఫిక్ తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రోడ్డు నిర్మాణంతో మరోవైపు నకిరేకల్ -టు నాగార్జున సాగర్ మధ్య కనెక్టివిటీ పెరగనుంది. ఇక, ఆంధ్రప్రదేశ్ టు- తెలంగాణల మధ్య ఈ జాతీయ రహదారి కీలకంగా మారనుంది. తెలంగాణలోని నకిరేకల్ వద్ద ఎన్‌హెచ్ 65తో జంక్షన్ నుంచి ప్రారంభమై నల్గొండ, మాచర్ల, ఎర్రగొండపాలెం కనిగిరి పట్టణాల మీదుగా ఈ రహదారి వెళుతుంది. ఈ రహదారి అభివృద్ధితో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరింత మెరుగైన రవాణావ్యవస్థను అందుబాటులోకి రానుంది. మరోవైపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు మహారాష్ట్ర, గోవాతో సహా పలు రాష్ట్రాల్లో పలు ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేస్తున్నట్లు రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.