Monday, December 23, 2024

ప్రయాణీకులకు తెలంగాణ ఆర్‌టిసి శుభవార్త

- Advertisement -
- Advertisement -

భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయి ఇబ్బంది పడుతున్న తెలుగు ప్రజలకు ఊరట కల్గించే శుభవార్త తెలంగాణ ఆర్‌టిసి చెప్పింది. హైదరాబాద్-విజయవాడ మార్గంలో రాకపోకలు సాగించే వారి కోసం టికెట్ ధరలో 10 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ఆర్‌టిసి ప్రకటించింది. రాజధాని ఎసి, సూపర్ లగ్జరీ బస్సులలో ఈ రాయితీ వర్తిస్తుంది. ఈ డిస్కౌంట్ సదుపాయాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని సంస్థ కోరింది. ముందస్తు రిజర్వేషన్ కోసం https://tgsrtcbus.in ని సంప్రదించాలని సూచించింది. ఈ విషయాన్ని టిజిఎస్ ఆర్‌టిసి ఎండి సజ్జనార్ ఎక్స్ వేదికగా ప్రకటించారు.

ప్రయాణికులకు ఆర్టీసీ భారీ ఊరట
భారీ వర్షాలు, వరదలతో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయాయి. అనేక ప్రాంతాల్లో జాతీయ రహదారులు కొట్టుకు పోవడంతో రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు ఆగిపోయి, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్(Hyderabad), విజయవాడ మధ్య ప్రయాణించే ప్రయాణికులకు టికెట్ ధరలో 10% రాయితీ కల్పిస్తున్నట్టు టీజీఎస్‌ఆర్టీసీ(TGSRTC) ఎండీ సజ్జనార్ ప్రకటించారు. ఇది అన్ని ఏసీ, రాజధాని, సూపర్ లగ్జరీ బస్సులో వర్తిస్తుందని, ముందస్తు రిజర్వేషన్స్ ఆర్టీసీ అధికారిక వ్బ్సైట్ https//www.tgsrtcbus.in లో చేసుకోవాలని అధికారులు ప్రయాణికులకు తెలియ జేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News