- Advertisement -
తిరుమల: కొవిడ్ కారణంగా రెండేళ్లుగా నిలిపివేసిన శ్రీవారి ఆర్జిత సేవలను ఏప్రిల్ 1 నుంచి తిరిగి ప్రారంభించి.. భక్తులను అనుమతి ఇవ్వాలని తితిదే నిర్ణయించింది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి ఆర్జిత సేవల టికెట్లను ఆన్‌లైన్‌లో మార్చి 20న ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది. ఈ మేరకు టికెట్లను బుక్ చేసుకునేందుకు ఈ నెల 22 వరకు గడువు విధించింది. tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది. ఆన్‌లైన్ ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో టికెట్లు కేటాయింపు ఉంటుందని.. ఈ నెల 22న టికెట్లు పొందిన వారికి వివరాలు పంపనున్నట్లు తితిదే తెలిపింది.
- Advertisement -