Sunday, December 22, 2024

టిఎస్ ఆర్టీసి ప్రయాణికులకు మరో గుడ్‌న్యూస్

- Advertisement -
- Advertisement -

ప్రయాణికులపై భారం తగ్గించేందుకు కీలక నిర్ణయం
మంత్లీ సీజన్ టికెట్ తీసుకుంటే
ప్రతి ప్రయాణంపై 33 శాతం డిస్కౌంట్

Bus ticket price hike to go up in telangana

మనతెలంగాణ/హైదరాబాద్:  టిఎస్ ఆర్టీసి ప్రయాణికులకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రయాణికులపై భారాన్ని తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆర్టీసి ఇలా ప్రయాణికులకు డిస్కౌంట్ ఇవ్వడానికి ముందుకు రావడం గమన్హారం. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రయాణించే వారికి మంత్లీ సీజన్ టికెట్ (Monthly Season Tickets (MST)ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా ప్రతి ప్రయాణంలో టికెట్‌పై 33 శాతం డిస్కౌంట్ ఇవ్వాలని ఆర్టీసి నిర్ణయించింది. ఈ విషయాన్ని ఎండి సజ్జనార్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ప్రయాణికులందరూ దీనిని వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News