Monday, January 6, 2025

యుజిసి విద్యార్థులకు బంపర్ ఆఫర్

- Advertisement -
- Advertisement -

అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు వెసులుబాటు కల్పించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యుజిసి) ఒక కొత్త ప్రణాళికను రూపొందించింది. డిగ్రీ కోర్సులకు సంబంధించి ప్రస్తుతం ఉన్న నిర్ణీత కాల వ్యవధికి బదులుగా అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఇక తమ చదువును తక్కువ కాలంలో లేదా మరింత ఎక్కువ కాలంలో పూర్తి చేసేందుకు వీలుగా ఉన్నత విద్యా సంస్థలు అవకాశం కల్పించనున్నాయి. ఈ వారంలో జరిగిన సమావేశంలో అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం శీఘ్ర డిగ్రీ ప్రోగ్రామ్(ఎడిపి), పొడిగించిన డిగ్రీ ప్రోగ్రామ్(ఇడిపి) అందచేసేందుకు ఉన్నత విద్యా సంస్థన్పాటించాల్సిన నియమ నిబంధనలను యుజిసి ఆమోదించినట్లు యుజిసి చైర్మన్ జగదీష్ కుమార్ తెలిపారు. ఎడిపి లేదా ఇడిపి కింద కోర్సు పూర్తి చేసినప్పటికీ ప్రస్తుతం అమలులో నిర్ణీత కాల వ్యవధి డిగ్రీ కోర్సుకు సమానంగా వాటి అర్హత ఉంటుందని,

పై చదువులకు, ఉద్యోగ నియామకాలకు ఈ డిగ్రీల విలువ అంతే సమానంగా ఉంటుందని ఆయన తెలిపారు. తమ అభ్యాస నైపుణ్యాల ఆధారంగా విద్యార్థులు తమ విద్యాభ్యాస కాల వ్యవధిని తగ్గించుకోవడం లేదా పెంచుకోవడం చేయవచ్చని ఆయన తెలిపారు. ఎడిపి ద్వారా విద్యార్థులు మూడేళ్లు లేదా నాలుగేళ్ల డిగ్రీని త్వరితంగా పూర్తి చేయవచ్చని, వారికి ప్రతి సెమిస్టర్‌కు అదనపు క్రెడిట్స్ ఉంటాయని ఆయన తెలిపారు. అదే విధంగా ఇడిపి కింద విద్యార్థులు తమ డిగ్రీ కాల వ్యవధిని పొడిగించుకోవచ్చని, వారికి ప్రతి సెమిస్టర్‌కు తక్కువ క్రెడిట్స్ పడతాయని ఆయన వివరించారు. ఈ ప్రోగ్రామ్స్‌కు అర్హులయ్యే విద్యార్థులను నిర్ణయించేందుకు ఉన్నత విద్యా సంస్థలు కమిటీలను ఏర్పాటు చేస్తాయని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News