Monday, January 6, 2025

రైల్వే శాఖలో 32 వేల ఉద్యోగాలు

- Advertisement -
- Advertisement -

నిరుద్యోగులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. రైల్వే శాఖలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న దాదాపు 32 వేల లెవెల్ 1 (గ్రూప్ డి) పోస్టుల భర్తీకి రైల్వే బోర్డు చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో విద్యార్హతల విషయమై బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ ఉద్యోగాల భర్తీకి అవసరమైన కనీస విద్యార్హత ప్రమాణాలను బోర్డు సడలించింది. కొత్త ప్రమాణాల ప్రకారం, పదవ తరగతి లేదా ఐటిఐ డిప్లొమా లేదా జాతీయ వృత్తి విద్యా శిక్షణ మండలి జారీ చేసిన నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికెట్ (ఎన్‌ఎసి) కలిగిన ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇటీవల విడుదలైన నోటీస్‌లో టెక్నికల్ విభాగాల్లో పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు కనీస విద్యార్హత పదవ తరగతితో పాటు ఎన్‌ఎసి సర్టిఫికెట్ లేదా ఐటిఐ డిప్లొమా కలిగి ఉన్నవారిని మాత్రమే అర్హులుగా బోర్డు పేర్కొన్నది.

అయితే, తాజాగా ఆ విద్యార్హత ప్రమాణాలను సదలిస్తూ బోర్డు నిర్ణయం ప్రకటించింది. రైల్వే శాఖలోని పలు విభాగాల్లో పాయింట్స్‌మన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెనర్ సహా దాదాపు 32 వేల పోస్టుల భర్తీకి బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం విదితమే. ఈ ఉద్యోగాలకు ఈ నెల 23 నుంచి ఫిబ్రవరి 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు స్వీకరించనున్నారు. ట్రాఫిక్, ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఈ పోస్టుల భర్తీకి వయో పరిమితి (ఈ నెల 7 నాటికి) 18 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం, ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి, దివ్యాంగ అభ్యర్థులకు వయో పరిమితి సడలింపు కల్పించారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షతో పాటు ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపికచేయనున్నారు. ప్రారంభ జీతం రూ. 18 వేలు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News