- Advertisement -
హైదరాబాద్: విజయ డైరీ రైతులకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుభవార్త తెలిపారు. రైతుల నుండి సేకరిస్తున్న పాల ధరను పెంచుతున్నట్లు ప్రకటించారు. రాజేంద్ర నగర్ లోని కో ఆపరేటివ్ మేనేజ్మెంట్ ఇనిస్టిట్యూట్ లో నిర్వహించిన పాడి రైతుల అవగాహన సదస్సులో మంత్రి తలసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గేదె పాలు 46.69 రూపాయల నుండి 49.40 రూపాయలకు ధర పెంచామని, ఆవుపాల ధర 33.75 నుంచి 38.75 రూపాయల కు పెంచామన్నారు. పాడి రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలతో సబ్సిడీపై పాడి గేదెలు, ఉచితంగా మందులు, వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. నష్టాలలో ఉన్న విజయ డెయిరీ తెలంగాణ ఏర్పడ్డాక లాభాలలో కి వచ్చిందని తలసాని స్పష్టం చేశారు.
- Advertisement -