Monday, December 23, 2024

కోఠి -కొండాపూర్ మార్గంలో మహిళలకు ప్రత్యేక బస్సు

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో ః మహిళా ప్రయాణికులకు ఆర్టీసి శుభవార్త తెలిపింది. కోఠి -కొండాపూర్ మార్గంలో మహిళల కోసం (లేడీస్) స్పెషల్ బస్సును నడపనున్నట్లు ప్రకటించింది.127K నంబర్ ప్రత్యేక బస్సు ఈ నెల 21 (సోమవారం) నుంచి ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ బస్సు ప్రతి రోజు ఉదయం 8.50 గంటలకు కోఠి నుంచి బయలుదేరి లక్దికాపుల్, మసబ్ ట్యాంక్, ఎమ్మెల్యే కాలనీ, ఉషా కిరణ్, గుట్టల బేగం పేట, శిల్పారామం, కొత్తగూడ ఎక్స్ రోడ్స్ మీదుగా కొండాపూర్‌కు చేరుకోనుంది. తిరిగి సాయంత్రం 5:45 గంటలకు కొండాపూర్ నుంచి అదే మార్గంలో కోఠికి చేరుకుంటుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News