Thursday, January 23, 2025

30, 31వ తేదీల్లో బస్సుల్లో మహిళలకు లక్కీ డ్రా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళలకు టిఎస్ ఆర్టీసి గుడ్ న్యూస్ చెప్పింది. ఈనెల 30, 31వ తేదీల్లో బస్సుల్లో ఎ క్కే మహిళలకు లక్కీ డ్రా ప్రకటించింది. ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన మ హిళలకు రూ.5.50 లక్షల విలువైన బహుమతులను అందజేస్తామని ఆర్టీ సి ఎండి సజ్జనార్ తెలిపారు. ఆగస్టు 30, 31 తేదీల్లో బస్సుల్లో ప్రయా ణం పూర్తయ్యాక మహిళలు తమ టికె ట్ వెనకాల పేరు, ఫోన్ నెంబర్ రాసి బస్టాండ్‌లలో ఏర్పాటు చేసిన బాక్స్ ల్లో వేయాలి.

ప్రతి స్టాండ్, ప్రయాణికుల రద్దీ ప్రాంతాల్లో డ్రాప్ బాక్స్‌లను సంస్థ ఏర్పాటు చేసింది. ప్రతి రీజియ న్ పరిధిలో ముగ్గురికి చొప్పున మొ త్తం 33 మందికి బహుమతులను ఇ వ్వనున్నట్టు తెలిపింది. డ్రా లో గెలుపొందిన మహిళలకు ఆకర్షణీయమైన రూ.5 లక్షల 50వేల విలువగల బహుమతులు అందించనుంది. మ హిళా ప్రయాణికులంద రూ ఈ లక్కీ డ్రాలో పాల్గొని విలువైన బహుమతులను గెలుచుకోవాలని ఆర్టీసి కోరింది. సెప్టెంబర్ 9లోగా డ్రాలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News