Monday, December 23, 2024

త్వరలో శుభవార్త

- Advertisement -
- Advertisement -

ఆసరా పింఛన్లు ఎంత పెంచాలి..
ఆడబిడ్డలకు ఎలా సాయం చేయాలని కెసిఆర్ ఆలోచిస్తున్నారు

మన తెలంగాణ/హన్మకొండ ప్రతినిధి:  రైతుల శ్రేయస్సు కోసం సిఎం కెసిఆర్ ప్రవేశపెడుతున్న రైతుబంధు గట్టునుంటారా? గతంలో రైతులను రాబందుల్లా పిక్కుతిన్న ప్రతిపక్షాల గట్టునుంటారా.. అని పురపాలక, ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరారావు అన్నా రు. దేశంలో ఎక్కడ కెసిఆర్ పేరు విన్నా సంక్షేమం గుర్తుకొస్తదని, అదే గత పా లకుల పేరు సంక్షేభం గుర్తుకొస్తదని విమర్శించారు. శుక్రవారం వరంగల్ ప శ్చిమ నియోజకవర్గంలో రూ. 900 కోట్లతో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం బాలసముద్రం హరిగ్రీవచారి గ్రౌండ్‌లో ఏర్పాటు బహిరంగ సభలో మంత్రి కెటిఆర్ ప్రసంగించారు. ఇవాళ ఎవరో వస్తరు.. ఏదో చేస్తారనే ఆలోచన అక్కర్లేదని.. కచ్చితంగా తొందరలోనే మీరంతా శుభవార్త వింటారని మంత్రి అన్నారు.

పెన్షన్లు ఎంత పెంచాలి? ఆడబిడ్డలకు ఎలా సాయం చేయాలి? ఎవరెవరికి ఏమేమీ చేయాలి? ఈ పదేండ్లలో చేసినదానికి ఇంకా ఎక్కువ ఎలా చేయాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఉన్నారని అన్నారు. తొందరలోనే మీకు ఆ శుభవార్త కూడా వస్తదని అన్నారు. ఇప్పటిదాకా ఇచ్చింది కేసీఆరే.. రేపు భరోసాగా ఇచ్చేది కూడా కేసీఆరే. ఎందుకంటే మళ్లీ వచ్చేది.. ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరే అని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్న బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి మీ మద్దతు తెలుపాలని, వచ్చే ఎన్నికల్లో బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించాలని అన్నారు. వరంగల్ ఈస్ట్, వెస్ట్ ప్రాంతాల్లో కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన సంక్షేమ కార్యక్రమా లు భద్రకాళి బండ్, డిజిటల్ లైబ్రరీ, రూ. 70 కోట్లతో బస్టాండ్, ఐటి టవర్, రూ. 26 కోట్లతో బంధం చెరువు సంక్షేమ కార్యక్రమాలు బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బిఆర్‌స్‌కే ఊపిరి పోసిందని హన్మకొండలో ఏ బహిరంగ సభ పెట్టినా పెద్ద ఎత్తున ప్రజలు ఆశీర్వదించారన్నారు. 23 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో కెసిఆర్‌కు శక్తిని యుక్తిని అందించింది వరంగల్ అన్నారు.

పింఛన్‌దారులు త్వరలో బ్రహ్మండైన శుభవార్త వింటారని కెసిఆర్ సిఎం ఆ దిశగా ఆలోచన చేస్తున్నారన్నారు. ఎన్నికలు వచ్చినపుడు సం క్రాంతికి గత గంగిరెద్దులు వచ్చినట్లు కాంగ్రెస్ వాళ్లు, బిజెపి వాళ్లు వస్తారు కా ని అభివృద్ధిని చూసి ఓటు వేసేది మాత్రం బిఆర్‌ఎస్‌కే అన్నారు. కాంగ్రెస్ ఒక ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నదని, ఇప్పటికే 11 ఛాన్స్‌లు ఇచ్చామని 55 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలన్నారు. పాలనలో విప్లవాత్మక మార్పులు రావాలంటే తెగువ, ధైర్యం ఉండాలని అ లాంటి తెగువ ధైర్యం కెసిఆర్‌కు మెండుగా ఉన్నాయన్నారు. తెలంగాణలో బి ఆర్‌ఎస్ ప్రభుత్వానికి ముందు కరెంటు పరిస్థితి ఏ విధంగా ఉండేదో ఒకసారి గమనించాలన్నారు. ప్రతీ షాపులో, ప్రతీ ఇంట్లో జనరేటర్ ఉండేది కాని నేడు అవసరం లేకుండా 24 గంటలు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బిఆర్‌ఎస్ ప్రభుత్వం కాదా అని అన్నారు. ఇది కాంగ్రెస్ వాళ్లకు కనబడతలేదా అని ప్రశ్నించారు. సాగు, తాగునీరు అందించిన ఘనత బిఆర్‌ఎస్ ప్రభుత్వందే అన్నారు.

మన సంక్షేమ కార్యక్రమాలను కాపీ కొట్టి కాంగ్రెస్, బిజెపి వాళ్లు పథకాల పేరుతో ముందుకు వస్తున్నారని అన్నారు. 1956లో హైదరాబాద్‌ను బలవంతంగా విలీనం చేసిన ఘతన కాంగ్రెస్‌కే దక్కిందన్నారు. 1968లో తెలంగాణ కోసం ఉద్యమించిన 300మందిని పొట్టన పెట్టుకున్న పాపం కూడా కాంగ్రెస్‌దేనన్నారు. 1971లో 14 ఎంపి స్థానాలకుగాను 11 స్థానాలు కాంగ్రెస్ గెలిచిన టిపిఎస్‌ను ఇందిరా గాంధీకి తాకట్టు పెట్టుకుందని, అక్రమంగా అన్యాయంగా 11 మందిని కాంగ్రెస్‌లో చేర్పించుకున్న ఘనత కాంగ్రెస్‌కే చెల్లుతుందన్నారు. 2001 గులాబీ జెండా తెలంగాణలో ఎగరేసి 2004 వరకు నిరంతరం పోరాటం చేయగా 2004లో తెలంగాణ ఇస్తామని మాట ఇచ్చిన కేంద్రం 2014 దాకా తాత్సారం చేస్తే అనేక వేల మంది మన తెలంగాణ బిడ్డలు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇది కాంగ్రెస్ పుణ్యం కాదా అని కెటిఆర్ ప్రశ్నించారు. విధిలేని పరిస్థితిలో 2014లో తెలంగాణ ప్రకటించిందన్నారు. స్వరాష్ట్రంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం గడిచిన పదేళ్లలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఇటు కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారన్నారు.

వరంగల్‌లో 24 అంతస్తులతో పెద్ద దవాఖానా నిర్మించిన ఘనత ఎవరిదని, అది కెసిఆర్ కాదా అని అదే విధంగా అనేక జిల్లాలను చేసిన ఘనత, మెడికల్ కళాశాలలు ఏర్పాటుచేయడంలో కేసీఆర్ చొరవ చూపారన్నారు. ఇంతకుముందు జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల కావాలనుకున్నా ధర్నాలు, ఆందోళనలు చేయవల్సి ఉండేదన్నారు. కాని నేడు మన ఇంటి వద్దనే మెడికల్ కళాశాలలు ఉం డటం వల్ల ఈ ప్రాంత విద్యార్థులకు ఎంతో మేలు జరిగిందన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబాకర్, కేసీఆర్ కిట్, ఆడపిల్ల పుడితే రూ. 13 వేలు, మగ పిల్లాడు పుడితే రూ. 12 వేలు ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది కాదా అన్నారు. గతంలో కాంగ్రెస్ పరిపాలన కాలంలో రూ. 200 ఉన్న పింఛన్‌ను నేడు రూ. 2000 ఇస్తున్నామన్నారు. అప్పుడు రూ. 29 లక్షల పింఛన్లు ఉన్న వారు నేడు 46 లక్షల మందికి అందిస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఓటు వేసి ఆశీర్వదించాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్, శాసన మండలి వైస్ బండా ప్రకాష్‌రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, కుడా ఛైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, రాష్ట్ర కార్పోరేషన్ ఛైర్మన్లు నాగుర్ల వెంకటేశ్వర్లు, వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News