ఆర్‌టిసి ప్రయాణీకులకు తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ శుభవార్త చెప్పింది. బెంగళూరు మార్గంలో వెళ్లే ప్రయాణికులకు ఆర్‌టిసి బస్సుల్లో టికెట్ చార్జీలో 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు ఆర్‌టిసి వెల్లడించింది. బెంగళూరుకు నడిచే అన్ని సర్వీసులకు ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని పేర్కొంది. ఎసి స్లీపర్(బెర్త్)కు చార్జీ ప్రస్తుతం రూ. 1569 ఉంటే 10 శాతం రాయితీ తర్వాత అది రూ. 1412కు తగ్గుతుంది. అలాగే ఎసి స్లీపర్ స్టార్(సీటర్)కు ప్రస్తుత చార్జీ రూ. 1203 నుండి రూ. 1083కు, , రాజధాని బస్సులో ప్రస్తుత చార్జీ రూ. 1203 నుండి రూ. 1083కు,
, నాన్ ఎసి స్లీపర్ (బెర్త్)కు ప్రస్తుత చార్జీ రూ. 1160 నుంచి రూ. 1044కు, నాన్ ఎసి సీటర్ ప్రస్తుత చార్జీ రూ. 951 నుంచి రూ. 856కు, సూపర్ లగ్జరీ బస్సుల్లో ప్రస్తుత చార్జీ రూ. 946 నుంచి రాయితీ తర్వాత రూ. 851కు తగ్గుతుందని ఆర్‌టిసి వెల్లడించింది. ఈ డిస్కౌంట్‌తో ఒక్కొక్కరికి రూ.100 నుంచి రూ.160 వరకు ఆదా అవుతుందని ఆర్‌టిసి స్పష్టం చేసింది. వివరాలు, టికెట్ల రిజర్వేషన్ కోసం ఆర్‌టిసి వ్బ్సైట్ www.tgsrtcbus.inను సంప్రదించాలని తాజాగా ఒక ప్రకటనలో వెల్లడించింది.