Monday, November 18, 2024

అమెరికా వెళ్లాలనుకునే విదేశాల్లోని భారతీయులకు చక్కని అవకాశం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : వ్యాపార అవసరాల నిమిత్తం, విహార యాత్రల కోసం అమెరికా వెళ్లే భారతీయులు వేగంగా వీసా పొందేందుకు ఆ దేశ రాయబార కార్యాలయం కొత్త నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. బీ1/బీ2 వీసా మీద అమెరికా వెళ్లాలనుకుని విదేశాల్లో ఉన్న భారతీయులు ఆయా దేశాల్లోని అమెరికా కాన్సులేట్ లేదా రాయబార కార్యాలయాల్లో కూడా వీసా అపాయింట్‌మెంట్‌ను పొందవచ్చని భారత్ లోని అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది. ఈమేరకు ట్విటర్‌లో ఒక ప్రకటన జారీ చేసింది. దీంతో విదేశాల్లో ఉండే భారతీయులు అమెరికా వీసా కోసం భారత్‌కు రావాల్సిన అవసరం ఉండదు. ఉదాహరణకు థాయ్‌లాండ్‌లో నివసిస్తున్న భారతీయులు అమెరికాకు వెళ్లాలనుకుంటే .. బీ1/బీ2 వీసా అపాయింట్‌మెంట్ కోసం భారత్‌కు రాకుండా బ్యాంకాక్ లోని అమెరికా కాన్సులేట్ లేదా రాయబార కార్యాలయంలో వీసా అపాయింట్ మెంట్‌ను పొందవచ్చు. భారత్‌లో అమెరికా వీసా జారీలో నెలకొన్న ఆలస్యాన్ని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

దీంతోపాటు భారత్ లోని ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, హైదరాబాద్ లోని అమెరికా కార్యాలయాల్లో సిబ్బందిని పెంచడంతోపాటు , శనివారం రోజున ప్రత్యేక ఇంటర్వూలు నిర్వహిస్తోంది. ఇటీవలే సుమారు 2,50,000 బీ1/బీ2 వీసా అపాయింట్‌మెంట్‌లను దరఖాస్తుదారుల కోసం అందుబాటులో ఉంచింది. “వీసా అపాయింట్‌మెంట్, జారీలో నెలకొన్న జాప్యాన్ని తగ్గించేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నాం. దీంతోపాటు అదనంగా విదేశాల్లోని అమెరికా రాయబార కార్యాలయాలకు సిబ్బందిని పంపి అక్కడి భారతీయులకు వీసా అపాయింట్‌మెంట్‌లు ఇచ్చేలా చర్యలు చేపడుతున్నాం ” అని అమెరికా కాన్సులేట్ లోని అధికారి ఒకరు తెలిపారు. గత ఏడాది అక్టోబరులో బీ1/బీ2 వీసా అపాయింట్‌మెంట్ గడువు దాదాపు 1000 రోజులు ఉండటంతో భారత్ లోని అమెరికన్ రాయబార కార్యాలయం ఈ ఏర్పాటు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News