Saturday, December 21, 2024

మంచి కంటెంట్‌కు మంచి ఆదరణ

- Advertisement -
- Advertisement -

Good reception for good content

 

నమో క్రియేషన్స్ పతాకంపై అమిత్ తివారీ, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్, కాలకేయ ప్రభాకర్ నటీనటులుగా రవిచరణ్ దర్శకత్వంలో ఆర్.ఎమ్ నిర్మించిన చిత్రం ‘నల్లమల’. ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో.. గో సంరక్షణ విశిష్టతను తెలియజేసేలా సినిమాను రూపొందించిన దర్శకుడు రవిచరణ్‌ను యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ శివకుమార్ శాలువాతో సన్మానించారు.

ఈ సందర్భం గా శివకుమార్ మాట్లాడుతూ గోవులను సంరక్షించుకోవాలనే సందేశాన్ని ఈ సినిమా ద్వారా ప్రజలకు అందించిన రవిచరణ్‌ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు. దర్శకుడు రవిచరణ్ మాట్లాడుతూ “మంచి కంటెంట్‌కు మంచి ఆదరణ ఉంటుందని ఈ సినిమా ద్వారా ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. నా మొదటి సినిమాకే ఇంత ఆదరణ వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరో అమిత్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News