Saturday, December 21, 2024

అంకితభావంతో పనిచేస్తే మంచి గుర్తింపు : మాధవరం

- Advertisement -
- Advertisement -

కేపీహెచ్‌బి: తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారితోపాటు పా ర్టీకి అంకితభావంతో పనిచేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందనడానికి కూకట్‌పల్లి మార్కెట్ కమిటీలో అవకాశం పొందిన వారే ఇందుకు నిదర్శనమని కూకట్‌పల్లి ఎ మ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన కూకట్‌పల్లి రైతు మార్కెట్ కు నూతనంగా ఎంపిక చేసిన కమిటీ పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎంఎల్‌సీ కుర్మయ్యగారి నవీన్‌కుమార్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో గాయకుడిగా చురుకైన పాత్ర పోషించిన గాయకుడు, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ అకాల మరణానికి సంతాపంగా మౌనం పాటించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మంత్రి హరీష్‌రావు సహకారంతో బోయిన్‌పల్లి మార్కెట్ కమిటీ నుండి విడదీసి కూకట్‌పల్లి వ్యవసాయ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పారు. కేపీహెచ్‌బిలోని కూకట్‌పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీని ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత వ్యవసాయానికి , రైతులకు పెద్ద పాట వేశారని, రైతులకు 24గంటల కరెంట్ బందు, రైతుబీమా లాంటి పథకాలు ప్రవేశపెట్టి రైతులు పండించిన ధన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రైతులు దళారుల చేతుల్లో చిక్కి మోస పోకుండా చేసిన సీఎం కేసీఆర్ రైతంగంమంతా రుణపడి ఉంటారని చెప్పారు.

రైతులు ప్రభుత్వానికి ప్రజలకు అమ్ముకునే విధంగా ప్రతి నియోజకవర్గంలో వ్యవసాయ మార్కెట్ కమిటీలను సీఎం కేసీఆర్ ఏర్పాటుచేశారని ఎమ్మెల్యే అన్నారు. మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా గుర్తింపు తీసుకువచ్చారని లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చి లక్షలాది ఉద్యోగ, ఉపాది అవకాశాలు కల్పిస్తున్నారని వివరించారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలో గత 70 ఏళ్ళలో జరగని అభివృద్ధి ఈ ఎనిమిదేళ్ళకాలంలో జరిగిందని, రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీని గెలిపించాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ కమిటీ కార్యదర్శి తోపాటు కార్పొరేటర్లు మందాడి, పగుడాల శిరీషాబాబూరావు, సబియాగౌసుద్దీన్, ముద్దం నర్సింహ్మాయాదవ్, రవీందర్‌రెడ్డి, సతీష్‌గౌడ్, నియోజకవర్గం బీఆర్‌ఎస్ కో ఆర్డినేటర్ సతీష్ అరోరాతోపాటు పలువురు బీఆర్‌ఎస్‌నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రమాణ స్వీకారం చేసిన నూతన పాలక వర్గం
వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా కుతాడీ రాములు, వైస్ చైర్మన్‌గా మందాడి సుదాకర్‌రెడ్డి, డైరెక్టర్లుగా బొట్టు విష్ణు, భవనీ, భారతి, సావిత్రి, ఎంత సంతోష్‌కుమార్, వేణుగోపాల్‌రెడ్డి, ప్రభాకర్‌రావు, శ్రీనివాస్‌రావు, జిల్లా గో పాల్ ఎన్ . నర్సింగ్‌రావు, ఎండీ జావిద్ షరీఫ్, ఎండీ యూసఫ్‌లు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News