Monday, December 23, 2024

జూ ఉచిత ప్రవేశానికి మంచి స్పందన

- Advertisement -
- Advertisement -

రాజేంద్రనగర్ : తెలంగాణ రాష్ట్రం దశమ వసంతంలో కి ఆడుగుపెట్టడం చారిత్రాత్మకమని నెహ్రూ జూలాజికల్ పార్కు క్యూరేటర్ ప్రశాంత్ బాజీరావుపాటిల్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను పురష్కరించుకొని ప్రభుత్వ ఆదేశానుసారం కల్పించిన సందర్శల ఉచిత ప్రవేశానికి మంచి స్పందన లభించిందని ఆయన తెలిపారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రతి సోమవారం జూపార్కుకు సెలవు అయినప్పటికి సందర్శకుల కోసం తెరిచి ఉచితంగా అనుమతించడంతో పాటు జూ ఆవరణలో హరితోత్సవ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా క్యూరేటర్ ప్రశాంత్ బాజీరావు పాటిల్ నెహ్రూ జూలాజికల్ పార్కులో వన్యప్రాణుల సంరక్షణ ప్రదర్శనతోపాటు సందర్శకులకు కావలసిన సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఉచితంగా కల్పించిన ప్రవేశ ద్వారా సోమవారం సు మారు 10 వేల మంది జూను సందర్శించినట్లు క్యూరేటర్ వెల్లడించారు. ఈ సందర్శంగా మెగా ప్లాంటేషన్ చేపట్టారు. వివిధ రకాల 200 మొక్కలను జూపార్కు ఆవరణలో నాటారు. ఈకార్యక్రమంలో డిప్యూటీ క్యూరేటర్ ఎ.నాగమణి, అసిస్టెంట్ క్యూరేటర్లు ఎ.సతీష్‌బాబు,బి.లక్ష్మణ్ తదితరులుపాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News