Friday, November 22, 2024

ఆర్‌టిసిలో క్యూఆర్ కోడ్‌కు మంచి స్పందన

- Advertisement -
- Advertisement -

Good response to QR code in TSRTC

సంస్థలో పాదర్శక సేవలకు అవకాశం
కోవిడ్ సమయంలో
ప్రయాణికులకు, సిబ్బందికి భరోసా

మన తెలంగాణ, హైదరాబాద్ : ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించడంలో భాగంగ ఆర్‌టిసి అధికారులు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్న సంగతి తెలిసిందే. గత నెల ప్రారంభించిన ఆర్‌టిసిలో ప్రారంభించిన క్యూఆర్ కోడ్ (యుపిఐ కోడ్) సేవలకు ఇటు ప్రయాణికులు ఇటు అధికారుల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. మొదట ప్రయోగాత్మకంగా సికింద్రాబాద్ రేతిఫిల్ బస్టేషన్, మహత్మాగాంధీ బస్టేషన్‌లోని రిజర్వేషన్ కౌంటర్, పార్సిల్ సర్వీసుల వద్ద ప్రారంభించింది. మంచి ఫలితాలు రావడంలో జేబిఎస్‌లో టికెట్ బుకింగ్ కౌంటర్, రిజర్వేషన్ కౌంటర్, కార్గోపార్సిల్ సర్వీలు వద్ద కూడా వీటిని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రతి చోట ఆన్‌లైన్ ట్రాన్స్‌క్షన్స్ అధికం కావడం మే కాకుండా ప్రయాణికులు బస్‌కండెక్టర్‌ను, డ్రైవర్లును ఫోన్ పే ఉందా, గూగుల్ పే ఉందాని అడుగుతున్నారని వారు చెబుతున్నారు.

సిటీలోని బస్ కండక్టర్ల వద్దే కాకుండా దూరం ప్రాంతాలకు వెళ్ళే డ్రైవర్లకు వద్ద కూడా ఇటువంటి సౌకర్యం కల్పిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని ప్రయాణికులు వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానం ద్వారా ఇటు ప్రయాణికుల, అటు ఆర్‌టిసి సిబ్బంది సమస్యలకు పరిష్కారం అవుతాయంటున్నారు. ముఖ్యంగా కండక్టర్లు , బస్‌డ్రైవర్లు విధి నిర్వాహణలో భాగంగా ప్రయాణికుల వద్ద నుంచి వసూలు చేసిన మొతాన్ని బ్యాగుల్లో మోయాల్సిన అవసరం ఉండక పోవడమే కాకుండా సంబంధిత మొత్తం వెంటనే సంస్థ అకౌంట్‌లో పడటంతో మరింత ఏకాగ్రతతో విధులు నిర్వహించవచ్చని చెబుతున్నారు. అంతే కాకుండా తరచు ప్రయాణికులు, సిబ్బంది మధ్య జరిగే చిల్లర వివాదాలకు స్వస్తి చెప్పవచ్చంటున్నారు. ఈ విధానంలో ప్రయాణికుడు చెల్లించిన మొత్తానికి సంబంధించిన సమాచారం వెంటనే మెసేజ్ రూపంలో ప్రయాకుడికి చేరుతుందని చెబుతున్నారు. అంతే కాకుండా సిబ్బందికి టికెట్ జారీ సమయంలో కూడా కూడా ఎటువంటి సమస్యలు ఉండవంటున్నారు.

అధికారులు తనిఖీ సమయంలో ప్రయాణికుడు తమ వద్ద ఉన్న టికెట్‌ను పొగొట్టుకున్నా ఫోన్‌లో వచ్చిన మెసేజ్‌ను చూపిస్తే సరిపోతుంది. పూర్తి స్థాయిలో ఈ క్యూఆర్ కోడ్ అమల్లోకి వస్తే సిబ్బందికి టిమ్స్(టికెట్ ఇష్యూమిషన్) మీద భారం తగ్గడమే కాకుండా భవిష్యత్‌లో టిమ్స్ అవసరం ఉండక పోవచ్చని, తద్వారా ప్రయాణికులకు టికెట్ ఇచ్చే అవకాశం ఉండదు కాబట్టి ఇటు టిమ్స్ మిషన్స్ మీద పెట్టే వ్యయం ఇటు టికెట్ పేపర్ మీద పెట్టే వ్యయం తగ్గడమే కాకుండా సంస్థపై కొంత ఆర్దిక భారం కూడా తగ్గే అవకాశం ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత కరోనా సమయంలో ప్రయాణికులు నుంచి డబ్బులు తీసుకోవడం కాని, వారికి చిల్లర ఇవ్వడం కాని జరిగే అవకాశం ఉండదు కాబట్టి ఇటు సిబ్బందిలో అటు ప్రయాణికుల్లో కోవిడ్ భయం ఉండే అవకాశం లేదంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News