Thursday, January 23, 2025

ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో సత్ఫలితాలు

- Advertisement -
- Advertisement -

అడ్డాకుల : తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని 2కే రన్‌ను ఘనంగా నిర్వహి ంచారు. అడ్డాకుల మండల కేంద్రాల్లో ఉత్సాహ ంగా రన్ కొనసాగింది. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రన్‌లో దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వ ర్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మ న్ స్వర్ణ సుధాకర్‌రెడ్డి, సిఐ రజితరెడ్డి, ఎస్‌ఐలు పో లీస్ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధు లు పాల్గొ న్నారు.

అడ్డాకుల మండల కే ంద్రంలో కాటవరం స్టేజీ నేషనల్ ఎన్ హెచ్ 44 2 కే రన్‌ను దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి జిల్లా చైర్మన్ స్వర్ణ సుధాకర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ రజితరెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లా డుతూ దేశంలోనే తొలిసారిగా అన్ని శాఖలను అనుసంధానం చేస్తూ అత్యాధునిక టెక్నాలజీతో నిర్మి ంచబడిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇది ఏ సమయంలోనైనా, ఎక్కడైనా ఏం జరిగిన క్షణాల్లో పసిగట్టే ఆధునిక సాంకేతి క పరిజ్ఞానం ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ప్రజలకు అం దుబాటులోకి వచ్చింద న్నారు.

రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో సత్ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. పోలీసులు ప్రజలకు చేరువై సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా చైర్మన్ సుధాకర్‌రెడ్డి, జడ్పీటీసీ రాజశేఖర్‌రెడ్డి, నాగార్జునరెడ్డి, మండల అధ్యక్షుడు తోకల శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్ కిషన్, ఉప తహ సీల్దార్ శ్రీనివాసులు, డీఎస్పీ రమణరెడ్డి, ఎస్‌ఐ మాధవరెడ్డి, భాస్కర్‌రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News