కాచిగూడ: బాల్యంలో నేర్చుకున్న మంచి విలువలు జీవితంలో ఉన్నతికి దోహదపడతాయని కేంద్రీయ విశ్వ విద్యాలయం నాట్యశాఖ అధిపతి డా.టి. అనురాధ అన్నారు. జాంబాగ్ బాలానంద సంఘం ఆధ్వర్యంలో త్యాగరాయగానస భలో సంఘం వ్యవస్థాపకులు మద్దిపట్ల వెంకట్రావు 90వ జయంతి కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మద్దిపట్ల వెంకట్రావు బాల సాహిత్య కృషి సంస్మరణీయం అన్నారు. 60 సంవత్సరాల క్రితం ఆయన రాసిన కథలు, నాటకాలు నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరముందని వివరించారు.
ఈ సందర్భంగా వెంకట్రావు రచించిన మద్దిపట్ల నాటకాలు, మద్దిపట్ల కథల పుస్తకాలను అతిథులు ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో నేటి పెద్దలు, ఐన అలనాటి పిన్నలు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సాహభరిత వాతావరణంలో సందడి చేశారు. నృత్యగురువు శివ రంజని శిష్య బృందం కూచిపూడి నృత్యప్రదర్శన ఆకట్టుకుంది. సంఘం కార్యదర్శి జీడిగుంట వెంకటరావు అధ్యక్షతన కార్యక్రమంలో సినీనటులు అశోక్‌కుమార్, సి.వి.ఎల్ నరసింహారావు, శేషుకుమా ర్, కృష్ణమూర్తి, సుబ్బారావు, బాలాజీ, గీత సుధాకర్, మద్దిపట్ల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.