Wednesday, January 22, 2025

మెరిడియన్ స్కూల్‌ తో భాగస్వామ్యం చేసుకున్న గూడీబ్యాగ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వ్యర్థ పదార్థాల నిర్వహణ, వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి అంకితం చేయబడిన భారతదేశంలోని అగ్రగామి స్టార్టప్, గూడీబ్యాగ్, బంజారాహిల్స్‌లోని మెరిడియన్ స్కూల్‌తో తమ భాగస్వామ్యాన్ని వెల్లడించటానికి , గూడీబ్యాగ్ అవార్డుల మొదటి ఎడిషన్‌ను ఆవిష్కరించడానికి హైదరాబాద్‌లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించింది. మెరిడియన్ స్కూల్‌తో ఈ భాగస్వామ్యం పర్యావరణంతో పాటుగా పాఠశాల కమ్యూనిటీ కి సైతం ప్రయోజనం చేకూర్చే పర్యావరణ అనుకూల నమూనాను రూపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. బంజారాహిల్స్‌లోని మెరిడియన్ స్కూల్ ప్రిన్సిపల్ నిషి రాణా, గూడీబాగ్ వ్యవస్థాపకుడు & సీఈఓ అభిషిక్ అగర్వాల్ మధ్య అవగాహనా ఒప్పందం పై సంతకాలు జరిగాయి.

గూడీబ్యాగ్, మెరిడియన్ స్కూల్ మధ్య ఈ భాగస్వామ్యం ప్లాస్టిక్ వ్యర్థాలు, కార్బన్ పాదముద్రలను తగ్గించడంలో ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది. ప్లాస్టిక్ కాలుష్యం గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటుగా వారి చురుకైన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా, ఈ కార్యక్రమం యువ తరంలో బాధ్యత, పర్యావరణ స్పృహను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది.

మెరిడియన్ స్కూల్, బంజారా హిల్స్, ఒక విలక్షణమైన కార్యక్రమం ను ప్రారంభించటం ద్వారా ఆవిష్కరణకు నాయకత్వం వహిస్తుంది, ఇందులో విద్యార్థులు గూడీబ్యాగ్ రివార్డ్ పాయింట్ల ద్వారా పొందిన పాఠశాల యూనిఫామ్‌లను ధరిస్తారు. ఈ మార్గదర్శక ప్రయత్నం ప్రపంచవ్యాప్తంగా విద్యా సంస్థలకు ఆదర్శంగా నిలుస్తుంది. విద్యార్థులు వారు అందించే మెటీరియల్‌ బరువుకు అనుగుణంగా రివార్డ్ పాయింట్‌లను సంపాదిస్తారు, వీటిని అనేక ఇతర బహుమతులు, ప్రయోజనాల కోసం మార్పిడి చేసుకోవచ్చు.

గూడీబ్యాగ్ , మెరిడియన్ స్కూల్ మధ్య భాగస్వామ్యం పర్యావరణం, పాఠశాల కమ్యూనిటీ రెండింటిపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా, మెరిడియన్ స్కూల్, బంజారా హిల్స్, ప్రపంచవ్యాప్తంగా మెరుగైన ప్రపంచానికి దోహదపడే మరియు ఇతర విద్యాసంస్థలను అనుసరించ గలిగేలా ప్రేరేపించే మొదటి పాఠశాల అవుతుంది.

ఈ భాగస్వామ్యంతో పాటు, పర్యావరణ పరిరక్షణకు విశేష కృషి చేసిన వ్యక్తులను సత్కరిస్తూ గూడీబ్యాగ్ అవార్డుల వేడుక మొదటి ఎడిషన్‌ను హైదరాబాద్‌లో గూడీబాగ్ నిర్వహించింది. బెస్ట్ ప్లాస్టిక్ కలెక్టర్, వైల్డ్‌లైఫ్ రెస్క్యూ హీరోస్, లేక్ గార్డియన్ అవార్డు వంటి అవార్డుల విభాగాల్లో వ్యక్తులను సత్కరించింది. ఈ కార్యక్రమానికి ఇండియన్ స్టార్టప్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు JA చౌదరి, IAS (రిటైర్డ్), తెలంగాణ ప్రభుత్వ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్; రెడ్ క్రాస్ సొసైటీ చైర్ పర్సన్, హైదరాబాద్ & IAS (రిటైర్డ్) అజయ్ మిశ్రా, టి హబ్ సీఈఓ మహంకాళి శ్రీనివాస్ రావు, సెరెండిపిటీ వ్యవస్థాపకుడు, కర్మవీర్ చక్ర అవార్డు గ్రహీత (Instd. by UN & iCongo). రుమానా సిన్హా సెహగల్ వంటి అతిథులు హాజరయ్యారు. ఎకోసిస్టమ్ ఎనేబలర్, సస్టైనబిలిటీ పార్టనర్‌గా గూడీబ్యాగ్ కోసం కీలక పాత్రను సెరెండిపిటీ పోషించింది.

గూడీబ్యాగ్ వ్యవస్థాపకుడు & సీఈఓ అభిషీక్ అగర్వాల్ మాట్లాడుతూ..”బంజారాహిల్స్‌లోని మెరిడియన్ స్కూల్‌తో మా భాగస్వామ్యాన్ని, గూడీబ్యాగ్ అవార్డుల మొదటి ఎడిషన్‌ను ఆవిష్కరించడం పట్ల మేము సంతోషిస్తున్నాము. ఈ కార్యక్రమాలు పర్యావరణ అనుకూల ప్రక్రియలను ప్రోత్సహించడం, పర్యావరణ సారథ్యం పట్ల మా నిబద్ధతను నొక్కి చెబుతున్నాయి. కలిసి పనిచేయడం ద్వారా పర్యావరణంపై సానుకూల ప్రభావాన్ని సృష్టించగలమని, పర్యావరణ అనుకూల జీవనశైలిని స్వీకరించడానికి భవిష్యత్ తరాలను ప్రేరేపించగలమని మేము నమ్ముతున్నాము” అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News