Sunday, January 12, 2025

ఒడిశాలో పట్టాలు తప్పిన గూడ్సురైలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఒడిశాల్లో ఘోర రైళ్ల ప్రమాదం నుంచి ఇంకా తేరుకోకుండానే మరో గూడ్స్ రైలు పట్టాలు తప్పిన సంఘటన సోమవారం జరిగింది. బర్ఘర్ జిల్లాలో ప్రయివేట్ నేరో గ్యాజ్ లో గూడ్సురైలు ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ గూడ్సురైలు డుంగిరి నుంచి బర్ఘర్‌కు సున్నం రాయి రవాణా చేస్తోందని అధికారులు చెప్పారు.

ప్రమాదంలో ఎవరూ గాయపడలేదన్నారు. డుంగిరి సున్నపు రాయి గనుల నుంచి బర్ఘర్ ఎసిసి సిమెంట్ ప్లాంట్ వరకు ప్రయివేట్ నేరో గ్యాజ్ లైన్ ఉంది. ఈ లైన్, వ్యాగన్లు, లోకో అన్నీ పూర్తిగా ప్రయివేట్ అని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News