Friday, December 27, 2024

మణిపూర్‌కు గూడ్స్‌రైలు..

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్ : మణిపూర్‌లో జాతుల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో దాదాపు రెండు నెలలుగా నిలిచిపోయిన గూడ్సురైల్వే సేవలను సోమవారం పునరుద్దరించారు. గువాహటి నుంచి తమెంగ్‌లాంగ్ జిల్లా ఖోంగ్సాంగ్‌కు నిత్యావసరాలు, ఆహార ధాన్యాలు తీసుకొచ్చిన రైలుకు ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్ స్వాగతం పలికారు. మే 3 న ఘర్షణలు చోటు చేసుకున్న తరువాత తొలిసారి ఆయన ఆదివాసీల ప్రాబల్యం ఉన్న జిల్లాలోకి అడుగుపెట్టారు. మే 5 నుంచి ఈ రాష్ట్రంలో రైల్వేసేవలు నిలిచిపోయాయి. ‘ ఈరోజు ఖోంగ్సాంగ్ రైల్వేస్టేషన్‌లో గూడ్స్ రైలు రాకను చూడడం ఆనందంగా ఉంది.

ఈ పరిణామం మణిపూర్ ప్రజలకు అనేక అవకాశాలు రాబోతున్నాయని సూచిస్తోంది. నిత్యావసర వస్తువులు , వేగవంతమైన రవాణా, సాధ్యపడనుంది. ఇలాంటి రవాణాతో పారిశ్రామిక వృద్ధి పరుగులు పెడుతుంది . ఈ చొరవతో రాష్ట్ర ఆర్థిక అవకాశాలను పురోగమించడంలో కీలక పాత్ర పోషించినందుకు ప్రధాని నరేంద్రమోడీకి ధన్యవాదాలు ’ అని సిఎం బీరేన్‌సింగ్ ట్వీట్ చేశారు. త్వరలో మహారాష్ట్ర నుంచి ఉల్లిపాయలు, పశ్చిమబెంగాల్ నుంచి బంగాళా దుంపలు, అస్సాం నుంచి నిత్యావసరాలు సరఫరా కానున్నట్టు రైల్వే అధికారులు వెల్లడించారు.
బీరేన్‌సింగ్‌పై ప్రశ్నల వర్షం
మణిపూర్ లో ప్రస్తుత పరిస్థితిపై సోమవారం కొందరు విలేఖరులు సిఎం బీరేన్‌సింగ్‌ను నిలదీయగా ఆయన మొక్కుబడిగా మాట్లాడి వెళ్లిపోయారు. మహిళలను నగ్నంగా ఊరేగించి లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో నిందితులను అరెస్టు చేయడంలో ఎందుకింత జాప్యం జరుగుతోందని ప్రశ్నించగ, నిందితులందర్నీ అరెస్టు చేశామని బదులిచ్చారు. మణిపూర్‌లో ఉద్రిక్త పరిస్థితి కొనసాగడం, సీఎం రాజీనామా చేయాలనే డిమాండ్లను ప్రస్తావించగా, ఎలాంటి సమాధానాలు ఇవ్వకుండానే ఆయన వెళ్లిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News