- Advertisement -
మహబూబాబాద్ రైల్వేస్టేషన్ శివారు 436/12 బి క్యాబిన్ వద్ద గూడ్స్ రైలు కప్లింగ్ ఊడిపోయింది. దీంతో మూడు బోగీలు రైలు నుండి విడిపోయాయి. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గూడ్స్ రైలు కప్లింగ్ ఊడిపోవడంతో మూడు బోగీలు రైలు నుండి దూరంగా వెళ్లిపోవడంతో ఘటన సరిగిన ప్రాంతంలోనే విధులు నిర్వహిస్తున్న రైల్వేగార్డు వెంటనే లోకో పైలట్‌ను అప్రమత్తం చేశాడు. దీంతో లోకోపైలట్ రైలును నిలిపివేశాడు. అనంతరం యుద్ధప్రాతిపాదికన మరమ్మతులు చేసి విడిపోయిన బోగీలను రైలుకు జోడించి రాకపోకలు సాగించే రైళ్లకు అంతరాయం కలుగకుండా చూశారు. కాగా, అక్కడ సమీపంలోనే రైల్వేగేట్ ఉంది. కానీ అక్కడ నుండి రైల్వేగేట్‌కు అటు, ఇటు వెళ్లే వాహనదారులకు ఎవరికీ ఎలాంటి అపాయం కలగకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది.
- Advertisement -