Sunday, January 19, 2025

ఒడిశాలో ప్లాట్ ఫాంపైకి గూడ్స్ రైలు… ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

జాజ్ పూర్: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు  ప్లాట్ ఫాం పైకి దూసుకెళ్లడంతో ముగ్గురు ప్రయాణీకులు మ‌ృత్యువాత పడ్డారు. ఒడిశాలోని జాజ్ పూర్ కొరై స్టేషన్ లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం ఈ ప్రమాదం జరగడంతో రైల్వే ఉన్నతాధికారులు వెంటనే స్పందించారు. గాయపడ్డ ప్రయాణీకులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో స్టేషన్ భవనం కూడా దెబ్బతిన్నదని రైల్వే అధికారులు తెలిపారు. వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్న రైల్వే రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టినట్టు వివరించారు. ప్రమాదం నేపథ్యంలో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలన్నీ నిలిచిపోయాయి.

రైలు వెయిటింగ్ రూమ్ ను ఢీ కొట్టడంతో అందులో ఉన్న ఇద్దరు ప్రయాణికులు, ప్లాట్ ఫాంఫైన ఉన్న మరో ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోయారని ఈస్ట్ కోస్ట్ రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది. గూడ్స్ రైలుకు చెందిన 10 బోగీలు బోల్తా పడ్డాయని స్టేషన్ అధికారులు చెప్పారు. ప్లాట్ ఫాం పైనున్న పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయని వివరించారు. వారందరినీ దగ్గర్లోని ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. బోల్తా పడిన బోగీల కింద పలువరు చిక్కుకుని ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News