Thursday, November 21, 2024

పెద్దపల్లిలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. జిల్లాలోని రాఘవపూర్ కన్నాల మధ్యలో గూడ్స్ రైలు 11 బోగీలు పట్టాలు తప్పి బోల్తా పడ్డాయి. స్థానికులు గుర్తించి రైల్వే శాఖకు సమాచారం ఇవ్వడంతో అలర్ట్ అయిన అధికారులు ఎక్కడికక్కడ రైళ్లను నిలిపివేశారు. సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు, గూడ్స్ రైళ్లు పట్టాలపైనే ఆగిపోవడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఢిల్లీ, చెన్నై ప్రధాన రైలు మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. రైళ్లు ఎక్కడికక్కడ ఆగిపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గూడ్స్‌రైలు బోగీలు పట్టాలపై పడిపోవడంతో దక్షిణ మధ్య రైల్వే 39 రైళ్లను రద్దు చేసింది.

మరో 53 రైళ్లను దారి మళ్లించి, 7 రైళ్లను రీ షెడ్యూల్ చేసింది. ఈ క్రమంలో తిరుపతి – జమ్మూ ఎక్స్ ప్రెస్ సైతం రద్దవ్వడంతో, సికింద్రాబాద్ లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. తిరుపతి – జమ్మూ రైలు కోసం సుమారు 200 మంది ప్రయాణికులు ఎదురుచూస్తుండగా, అధికారులు అప్పటికప్పుడు రైలును రద్దు చేసినట్లు ప్రకటించారు. దీంతో తమకు ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రయాణీకులు ఆందోళనకు దిగారు. ఇప్పటికిప్పుడు తమను వేరే మార్గాల్లో వెళ్లాలని చెప్తే ఎటు వెళ్లాలని వాపోయారు. ప్రభుత్వం లేదా రైల్వే అధికారులే ప్రత్యామ్నాయం చూపాలని ఆందోళనకు దిగారు. కాగా పట్టాలు తప్పిన గూడ్సురైలుకు మరమ్మతులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. మరింత సమయం పడుతుందని అధికారులు తెలిపారు. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు మరో 15 గంటల సమయం పడుతుందని చెప్పారు. దీంతో సంపర్క్ క్రాంతి, నవజీవన్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆలస్యంగా నడవనున్నాయి.

రద్దయిన రైళ్ల వివరాలు
నర్సాపూర్ – సికింద్రాబాద్, సికింద్రాబాద్ -నాగ్ పుర్, హైదరాబాద్ – సిర్పూర్ కాగజ్ నగర్, సికింద్రాబాద్ – కాగజ్ నగర్, కాజీపేట – సిర్పూర్ టౌన్, సిర్పూర్ టౌన్ – కరీంనగర్, కరీంనగర్ – బోధన్, సిర్పూర్ టౌన్ – భద్రాచలం రోడ్, భద్రాచలం రోడ్ -బల్లార్షా, బల్లార్షా – కాజేపేట, యశ్వంత్ పూర్ – ముజఫర్ పూర్, కాచిగూడ – నాగర్ సోల్, కాచిగూడ – కరీంనగర్, సికింద్రాబాద్ – రామేశ్వరం, సికింద్రాబాద్ – తిరుపతి, ఆదిలాబాద్ – పర్లి, అకోలా – పూర్ణ, ఆదిలాబాద్‌నాందేడ్, నిజామాబాద్ – కాచిగూడ, గుంతకట్టు -బోధన్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News