Sunday, December 22, 2024

అల్లూరి సీతారామరాజు జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అల్లూరి-సీతారామరాజు జిల్లాలోని కిరండోల్-విశాఖపట్నం మార్గంలో శివలింగపురం రైల్వే స్టేషన్‌లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గూడ్స్ రైలు ఇనుములోడుతో ఛత్తీస్‌గఢ్ నుంచి విశాఖపట్నానికి వెళ్తుండగా పట్టాలు తప్పడంతో ఏడు బోగీలు పక్కకు ఒరిగాయి. బోగీలు పడిపోవడంతో పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాలు కూడా దెబ్బతిన్నాయి. ఆ మార్గంలో వెళ్లే ప్యాసింజర్ రైళ్లను అధికారులు రద్దు చేశారు. ప్రయాణికులకు నగదు తిరిగి చెల్లించారు. రైల్వే డిఆర్‌ఎం సత్పతి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. 36 గంటల్లో ట్రాక్ పనులను పునరుద్ధరిస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News